పత్రికా స్వేచ్ఛకు ప్రాధాన్యమివ్వాలి | - | Sakshi
Sakshi News home page

పత్రికా స్వేచ్ఛకు ప్రాధాన్యమివ్వాలి

Sep 12 2025 5:59 AM | Updated on Sep 12 2025 5:59 AM

పత్రి

పత్రికా స్వేచ్ఛకు ప్రాధాన్యమివ్వాలి

పత్రికా స్వేచ్ఛకు ప్రాధాన్యమివ్వాలి రాజ్యాంగ హక్కులపై దాడి

గోదావరిఖని: ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛకు ప్రాధాన్యమివ్వాలి. సాక్షి ఎడిటర్‌ ధనంజయ్‌రెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేయ డం అన్యాయం. ఎవరో అన్నది రాస్తే.. దాన్ని పత్రికకు ఆపాదించి ఎడిటర్‌పై కేసు పెట్టడం సరికాదు.ఏపీలో మీడియాను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

– రాజ్‌ఠాకూర్‌, ఎమ్మెల్యే, రామగుండం

ఏపీలో పత్రికా స్వేచ్ఛపై దాడిచేసి రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారు. సాక్షి ఎడిటర్‌ను లక్ష్యంగా చేసుకుని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం అన్యాయం. పత్రికల్లో వచ్చిన వార్తల్లో ఏదైన తప్పు ఉంటే వివరణ కోరాలే తప్ప ఇలా అక్రమ కేసులు పెట్టి బెదిరించడం సరికాదు. – కోరుకంటి చందర్‌,

బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, పెద్దపల్లి

నిరంకుశత్వమే..

సాక్షి పత్రికలో వచ్చిన వార్తల విషయంలో ఎడిటర్‌పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలు ఏపీ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం. రాజకీయ నాయకుల విమర్శలను ప్రచురిస్తే కేసులు పెట్టడం పత్రికా స్వేచ్ఛను హరించడమే.

– కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, సుడా చైర్మన్‌

ముమ్మాటికీ కక్ష సాధింపే

అన్ని పత్రికలమాదిరిగానే సాక్షిలో అమరావతి పేరిట పొన్నూరును ముంచేశారనే వార్త వచ్చింది. దీనిపై పోలీసులు సాక్షి ఎడిటర్‌పై కేసు పెట్టడం ఏంటి?కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేసులు పెడుతోంది. ఇది ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించడమే. ప్రచురించిన వార్తలపై అభ్యంతరాలుంటే.. ప్రభుత్వాలు ఖండించడం, రిజాయిండర్లు జారీ చేసే వీలుంది.

– పంజాల శ్రీనివాస్‌,

సీపీఐ జిల్లా కార్యదర్శి, కరీంనగర్‌

ప్రజాస్వామ్యానికి మచ్చ

సాక్షిపై ఏపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారు. కేవలం వ్యతిరేఖ వార్తలు రాసారన్న కారణంతో ఎడిటర్‌, పాత్రికేయులపై కేసులు నమోదు చేయడం సిగ్గుచేటు. రాజ్యాంగ విలువలు కాపాడాల్సిన ప్రభుత్వమే పత్రికల గొంతు నొక్కడం అన్యాయం. ప్రెస్‌ మీట్‌ వార్త ప్రచురించిన సాక్షి పత్రిక ఎడిటర్‌ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు పెట్టడం సిగ్గు చేటు. – మణికంఠరెడ్డి,

ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు

ఏపీలో కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆయా రాజకీయ పార్టీల నాయకులు మండిపడ్డారు. ప్రతికా స్వేచ్ఛకు విఘాతం కలిగేలా ప్రజాస్వామ్య విలువలకు భంగం వాటిల్లేలా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నడుచుకుంటోందన్నారు. ‘సాక్షి’ ఎడిటర్‌ ధనంజయరెడ్డితో పాటు విలేకరులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

పత్రికా స్వేచ్ఛకు  ప్రాధాన్యమివ్వాలి
1
1/5

పత్రికా స్వేచ్ఛకు ప్రాధాన్యమివ్వాలి

పత్రికా స్వేచ్ఛకు  ప్రాధాన్యమివ్వాలి
2
2/5

పత్రికా స్వేచ్ఛకు ప్రాధాన్యమివ్వాలి

పత్రికా స్వేచ్ఛకు  ప్రాధాన్యమివ్వాలి
3
3/5

పత్రికా స్వేచ్ఛకు ప్రాధాన్యమివ్వాలి

పత్రికా స్వేచ్ఛకు  ప్రాధాన్యమివ్వాలి
4
4/5

పత్రికా స్వేచ్ఛకు ప్రాధాన్యమివ్వాలి

పత్రికా స్వేచ్ఛకు  ప్రాధాన్యమివ్వాలి
5
5/5

పత్రికా స్వేచ్ఛకు ప్రాధాన్యమివ్వాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement