
క్యూలో చెప్పులు.. అవే తిప్పలు
గన్నేరువరం: యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. ఇన్నాళ్లు సొసైటీల ద్వారా యూరియా పంపిణీ చేసిన అధికారులు గురువారం రైతు వేదికల నుంచి అందించారు. అయినా అవస్థలు తప్పడం లేదు. యూరియా కోసం చెప్పులు క్యూలో పెట్టారు. కాసింపేట రైతు వేదికలో కాసింపేట, పారువెల్ల మైలారం సాంబయ్యపల్లి రైతులకు 230 బస్తాలు, మాదా పూర్ రైతువేదికలో మాదాపూర్, హన్మాజిపల్లి, గోపాల్‌పూర్ రైతులకు 230 బస్తాల చొప్పున అందించారు. వందల సంఖ్యలో రైతులు రావడంతో పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ చేపట్టారు. కాగా.. కాసింపేటకు చెందిన బండి శ్రీనివాస్ గౌడ్, బండి ఎల్లవ్వకు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు శివారులో వ్యవసా య భూమి ఉంది. ఆధార్ కార్డు కాసింపేటలో ఉంది. ఆధార్ కార్డు ఇక్కడ, భూమి అక్కడ ఉండడంతో యూరియా ఇవ్వడం లేదని అన్నారు.
ఇన్‌చార్జి డీఈవోగా శ్రీరాం మొండయ్య
కరీంనగర్: ఇన్‌చార్జి డీఈ వోగా డైట్ ప్రిన్సి పాల్ శ్రీరాం మొండయ్యను నియమిస్తూ కలెక్టర్ పమేలా సత్పతి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఈవో చైతన్యజైనీ నెల రోజుల పాటు సెలవుపై వెళ్లారు. దీంతో ఎల్‌ఎండీ కాలనీలోని డైట్ ప్రిన్సిపాల్ శ్రీరాం మొండయ్యను ఇన్‌చార్జిగా నియమించారు.
ఉద్యోగ సంఘాల గుర్తింపు రాష్ట్ర జేఏసీ విజయం
కరీంనగర్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ 185 ద్వారా సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌ను పునఃసంస్థాపించడం చారిత్రాత్మక నిర్ణయమని ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్ దారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం స్థానిక టీఎన్జీవో భవన్‌లో మాట్లాడుతూ ఉద్యోగులు ప్రజలకు, ప్రభుత్వానికి వారధులుగా పని చేస్తూ, సంక్షేమ పథకాల అమలులో కీలకపాత్ర పోషిస్తున్నారని గుర్తుచేశారు. ఈ విజయం సాధించడంలో రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాస్, ముజీబ్ కృషి ప్రశంసనీయమని కొనియాడారు. నాయకులు మడిపల్లి కాళీచరణ్, అరవింద్ రెడ్డి, సంగెం లక్ష్మణరావు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోట రామస్వామి హర్షం వ్యక్తం చేశారు.
జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌లో గురువారం క్వింటాల్ పత్తి రూ. 7,450 పలికింది. క్రయ విక్రయాలను ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.

క్యూలో చెప్పులు.. అవే తిప్పలు

క్యూలో చెప్పులు.. అవే తిప్పలు