
శుక్రవారం శ్రీ 12 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
సీపీకి లీగల్ నోటీసులు, సీఐలకు దమ్కీలు
మెటాలో మరో కేసు
పోలీసుల అదుపులో దాసరి రమేశ్, రాజు, ప్రకాశ్, శ్రీధర్
వాస్తవరూపం దాలుస్తున్న ‘సాక్షి’ కథనాలు
సీపీకే లీగల్ నోటీసులు, పోలీసులకు దమ్కీలు
ఉమ్మడి జిల్లా వాసులకు రూ.100కోట్లు టోకరా?
బాధితుల డబ్బులతో దుబాయ్‌లో బినామీ ఆస్తులు
ఫిర్యాదు చేసేందుకు ముందుకొస్తున్న బాధితులు
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
క్రిప్టో కరెన్సీ పేరిట పాత జిల్లావాసులకు రూ.100 కోట్లు కుచ్చుటోపీ పెట్టిన మెటా ఫండ్ యాప్ కథ కొలిక్కి వచ్చింది. రోజుకు రూ.లక్షలు సంపాదించవచ్చని ఆశచూపి రూ.కోట్లు వసూలు చేసిన సూత్రధారుల్లో నలుగురుని కరీంనగర్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. జూలైలో కశ్మీర్‌గడ్డకు చెంది న పుప్పాల శ్రీకర్ తనను మెటా ఫండ్ పేరిట రూ.54 లక్షల మేర మోసం చేశారని దాసరి రమేశ్, దాసరి రాజుపై ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో పరారీలో ఉన్న దాసరి రమేశ్, దాసరి రాజులతోపాటు బూర శ్రీధర్, తులసీ ప్రకాశ్‌ను పో లీసులు అరెస్టు చేశారు. వీరితోపాటు లోకేశ్, సతీశ్ ను అరెస్టు చేయాల్సి ఉంది. లోకేశ్ థాయ్‌లాండ్‌లో తలదాచుకుంటుండగా, సతీశ్ దుబాయ్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ కేసులో జాతీయ నిఘా సంస్థలు, రాష్ట్ర నిఘా సంస్థలు నిందితుల పాత్రపై ఎప్పుడో పూర్తిగా సమాచారం సేకరించాయి. ఈ విషయంలో జూన్ నుంచి ‘సాక్షి’ రాస్తున్న కథనాలు వాస్తవరూపం దాలుస్తుండటం గమనార్హం.
దుబాయ్‌లో ఆస్తులు
మెటా ఫండ్ నిర్వాహకులు ఎంతమంది అన్నది ఇప్పటికీ స్పష్టత లేదు. నిందితులు ఇక్కడ వసూలు చేసిన డబ్బును హవాలా మార్గంలో విదేశాలకు పంపారు. దుబాయ్‌లో దాదాపు రూ.40 కోట్లు ఖర్చు చేసి వరల్డ్ ట్రేడ్ సెంటర్, షేక్ జాహిద్ రోడ్‌లో ఈ ఏడాది జనవరిలో పబ్ ప్రారంభించారు. వీరి బినా మీల పేర్లతో అక్కడ పలు వ్యాపారాలు మొదలు పెట్టారని, లక్కీ భాస్కర్ సినిమాలో మాదిరిగా పరి స్థితులు అనుకూలించకపోతే ఉన్నపలంగా వీసా తీసుకుని దేశం వదిలి పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. వీరు ఏడాదిన్నరగా పలువు రి వద్ద నుంచి రూ.కోట్లు వసూలు చేశారు. వీరిలో సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, పెద్దపల్లి జిల్లాలకు చెందిన టీచర్లు, లెక్చరర్లు, పోలీసులు, రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారు. వీరు ఇంతకాలం మౌనంగా ఉన్నా.. ఇప్పుడిప్పుడే ముందుకొస్తున్నారు.
మెటా నిర్వాహకుల్లో కొందరు పాత నేరస్తులు కావడంతో పోలీసులతో మంచి పరిచయాలు ఉన్నాయి. భారీగా లంచాలు ఎరవేసి ఇంతకాలం తమపై కేసులు కాకుండా జాగ్రత్త పడ్డారు. పైగా ఫిర్యాదుదారులనే పోలీసుల చేత బెదిరింపులకు గురిచేయించారు. కరీంనగర్ సీపీకి సైతం లీగల్ నోటీసులు పంపారు. తమపై ఫిర్యాదు చేసిన వారిపై కోర్టులో ప్రైవేటు కేసు నడిపిస్తున్నారు. వీరు అంతటితో ఆగలేదు. తమ యాప్‌లో పెట్టుబడులు పెట్టిన నలుగురు సీఐలు డబ్బులు అడుగుతుంటే దమ్కీలు ఇస్తుండటం గమనార్హం. విదేశీ యాత్ర సమయంలో మీరు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోలేదని, విదేశాల్లో మీరు రహస్యంగా దేశ విద్రోహ శక్తులతో సమావేశం అయ్యారని, వ్యభిచారం చేసి డిపార్ట్‌మెంట్ రహస్యాలు అమ్ముకున్నారని, కోర్టుల్లో ప్రైవేటు కేసు వేసి ఉద్యోగాలు పోగొడతామని బెదిరింపులకు గురిచేస్తున్నారు. రూ.కోట్లాది డబ్బు విదేశాలకు తరలిపోయిన నేపథ్యలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగప్రవేశం చేస్తేనే వీరి ఆస్తుల చిట్టాలో అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి.
మెటా వ్యవహారంలో మరో కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో సూత్రదారుల్లో ఒకరిగా భావిస్తున్న సతీశ్ పై గురువారం కేసు నమోదు అయ్యింది. అధిక లాభాలు వస్తాయని ఆశ పెట్టి తమను రూ.11 లక్షల వరకు మోసం చేసాడని బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. సదరు వ్యక్తిని రెండు రోజుల్లో అరెస్టు చేస్తారని సమాచారం.

శుక్రవారం శ్రీ 12 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025

శుక్రవారం శ్రీ 12 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025