
అల్ఫోర్స్ ఇ–టెక్నోలో స్నేహితుల దినోత్సవం
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ–టెక్నో పాఠశాలలో ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఉపాధ్యాయులతో విద్యాసంస్థల చైర్మన్ డా.వి.నరేందర్‌రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. స్నేహితుల ద్వారా ఆనందంతో పాటు సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. ఆపదకు ఆపన్నహస్తంగా స్నేహితులు నిలుస్తారని, నేటి పోటీ ప్రపంచంలో సమయభావం వల్ల చాలామంది స్నేహితులు దూరమవుతున్నారని, వారితో సంప్రదింపులకు సైతం సమయం కేటాయించకపోవడం విచారకమరని పేర్కొన్నారు. తరతరాల నుంచి వస్తున్నటువంటి స్నేహబంధ వైవిధ్యాన్ని, గొప్పతనాన్ని, విశిష్టతను ప్రతిఒక్కరూ పాటిస్తూ, స్నేహబంధంలో నైతిక విలువలను అమలు చేస్తూ ఆదర్శంగా నిలవాలని కోరారు. వేడుకల్లో భాగంగా నరేందర్‌రెడ్డికి ఉపాధ్యాయులు ఫ్రెండ్‌షిప్ రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.