
పెన్షన్ డబ్బులతో ప్రతిభా పురస్కారాలు
● విశ్రాంత ఏఈ మల్లేశం దాతృత్వం
సిరిసిల్లకల్చరల్: పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకు ఓ విశ్రాంత ఉద్యోగి ముందుకొచ్చారు. తన పెన్షన్ డబ్బుల్లోంచి రూ.1.50లక్షల చొప్పున బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. వాటిపై వచ్చే వడ్డీ సొమ్ముతో ప్రతిభావంతులకు పురస్కారాలిచ్చేలా ఏర్పాట్లు చేశారు. సిరిసిల్లకు చెందిన కుసుమ రామయ్య పెద్దకుమారుడు మల్లేశం ఏఈగా ఉద్యోగ విరమణ చేశారు. తనకొచ్చిన పెన్షన్ డబ్బుల్లోంచి రూ.1.50లక్షల చొప్పున తాను చదువుకున్న శివనగర్ జెడ్పీ హైస్కూల్‌తోపాటు అగ్రహారంలోని పాలిటెక్నిక్ కళాశాలలకు అందజేశారు. వీటిపై వచ్చే వడ్డీ సొమ్ముతో ఏటా ప్రతిభ చూపే విద్యార్థులకు పురస్కారాలు ఇవ్వాలని ఆయా సంస్థల హెచ్‌ఎం, ప్రిన్సిపాళ్లకు సూచించారు. మరిన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇదే తరహా నిధి ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.