బండమీది బడి.. చదువుల ఒడి | - | Sakshi
Sakshi News home page

బండమీది బడి.. చదువుల ఒడి

Jun 18 2025 7:18 AM | Updated on Jun 18 2025 7:18 AM

బండమీ

బండమీది బడి.. చదువుల ఒడి

● ఈ బడిలో చదివి ఉన్నతస్థానాల్లో నిలిచిన పలువురు ● ఎంతో మందికి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చిన రుద్రంగి పాఠశాల

రుద్రంగి(వేములవాడ): మండల కేంద్రంలోని బండమీది బడిగా ప్రఖ్యాతి పొందిన రుద్రంగి జెడ్పీ హైస్కూల్‌కు బహుచరిత్ర ఉంది. సుమారు 70 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ పాఠశాలలో ఎంతో మంది విద్యార్థులు చదువుకొని ఉజ్వల భవిష్యత్తును పొందారు. ఎంతోమంది నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తూ బండమీది బడి చదువుల ఒడిగా విలసిల్లుతుంది. ప్రస్తుత ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ బండమీది బడిలోనే హైస్కూల్‌ విద్యను అభ్యసించారు. అలాగే ప్రస్తుతం వరంగల్‌ జిల్లా వర్ధన్నపేటలో ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న రుద్రంగి మండల కేంద్రానికి చెందిన అంబటి నర్సయ్య, హైకోర్టు జడ్జిగా చేసి రిటైర్డ్‌ అయిన రుద్రంగికి చెందిన ఓలిమినేని నిరంజన్‌రావు ఈ బడిలో విద్యను అభ్యసించినవారే.

ఉన్నత స్థానాల్లో మరికొందరు..

హన్మాజీపేట గ్రామానికి చెందిన గడ్డం జలపతిరెడ్డి రాష్ట్ర ఎస్‌టీవోగా చేసి రిటైర్డ్‌ అయ్యారు. రుద్రంగికి చెందిన మర్రిపల్లి చందన చైల్డ్‌ ప్రొటెక్షన్‌ కమిటీ మెంబర్‌గా ప్రస్తుతం హైదరాబాద్‌లో చేస్తున్నారు. దేశవేని శంకర్‌ ప్రస్తుతం స్కూల్‌ అసిస్టెంట్‌గా చేస్తుండగా, రుద్రంగికి చెందిన కత్తి మల్లయ్య ఆడిటర్‌గా పనిచేశారు. చందుర్తి మండలం లింగంపేట గ్రామానికి చెందిన ఉప్పులూటి గోవిందరావు అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా, చందుర్తి మండల కేంద్రనికి చెందిన దామోదర్‌ వరంగల్‌లో ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్డ్‌ అయ్యారు. రుద్రంగికి చెందిన ఆకుల రవి ఇటీవల స్కూల్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించారు. వెంకటేశం బ్యాంకు మేనేజర్‌గా చేసి ఉద్యోగ విరమణ పొందారు. రుద్రంగికి చెందిన మర్రిపల్లి చక్రవర్తి సేఫ్టీ కన్సల్టెంట్‌గా చేస్తున్నారు. ఇంకా ఎంతో మంది రుద్రంగి జెడ్పీ హైస్కూల్‌లో విద్యను అభ్యసించి ఉన్నత స్థానాల్లో ఉన్నారు.

చదివిన బడిలోనే టీచర్‌గా..

బండమీది బడిలో ఉన్నత విద్యను అభ్యసించిన రుద్రంగి మండల కేంద్రానికి చెందిన గడప వేణుకుమార్‌ చదివిన బడిలోనే టీచర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించారు. చదివిన బడిలోనే విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే అవకాశం లభించడం సంతోషంగా ఉందని తెలిపారు.

రుద్రంగి బడిలో నాణ్యమైన విద్య

రుద్రంగి జెడ్పీ హైస్కూల్‌లో నిష్ణాతులైన ఉపాధ్యాయ బృందంతో నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. తల్లిదండ్రులు తమ పిల్లలను రుద్రంగి జెడ్పీ హైస్కూల్‌లో చేర్పించాలి.

– సమ్మిరెడ్డి, హెచ్‌ఎం,

రుద్రంగి జెడ్పీ హైస్కూల్‌

హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి

రుద్రంగికి చెందిన ఓలిమినేని నిరంజన్‌రావు రుద్రంగి బండమీది బడి విద్యార్థి. ఇక్కడ ఓనమాలు నేర్చిన ఆయన ఉన్నత చదువులు చదివి హైకోర్టు జడ్జిగా చేసి రిటైర్డ్‌ అయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.

ఏసీపీగా నర్సయ్య

బండమీద బడి విద్యార్థి పోలీస్‌ శాఖలో ఉద్యోగం సాధించి అంచలంచెలుగా ఎదిగి ప్రస్తుతం ఏసీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రుద్రంగి మండల కేంద్రానికే చెందిన అంబటి నర్సయ్య తన ప్రాథమిక, ఉన్నత, ఇంటర్‌, పోస్టు గ్రాడ్యుయేషన్‌ చదువులు అంతా ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే కొనసాగించి పోలీస్‌ శాఖలో ఎస్సైగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ప్రస్తుతం వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట ఏసీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

రుద్రంగి హైస్కూల్‌ విద్యార్థి ప్రభుత్వ విప్‌గా..

ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ స్వగ్రామం రుద్రంగి. రుద్రంగి బండ మీది బడిలోనే తన హైస్కూల్‌ విద్యను అభ్యసించారు. చదువుకున్న బడితో పాటు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసే అవకాశం లభించడం ఎంతో గర్వ కారణంగా ఉందని ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ నాణ్యమైన విద్యను అందిస్తుందని, విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ పాఠశాలల్లో చేరి నాణ్యమైన విద్యను అభ్యసించి ఉన్నత స్థానాల్లో నిలవాలని కోరారు.

బండమీది బడి.. చదువుల ఒడి1
1/5

బండమీది బడి.. చదువుల ఒడి

బండమీది బడి.. చదువుల ఒడి2
2/5

బండమీది బడి.. చదువుల ఒడి

బండమీది బడి.. చదువుల ఒడి3
3/5

బండమీది బడి.. చదువుల ఒడి

బండమీది బడి.. చదువుల ఒడి4
4/5

బండమీది బడి.. చదువుల ఒడి

బండమీది బడి.. చదువుల ఒడి5
5/5

బండమీది బడి.. చదువుల ఒడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement