కరీంనగర్‌క్రైం: కరీంనగర్ కమిషనరేట్ కేంద్రంలో మంగళవారం పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సీపీ గౌస్‌ఆలం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో పోలీసు అధికారుల సమన్వయంతో 3,478 కేసులు పరిష్కరించినందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను అభినందించారు. కోర్టులో పెండింగ్ కేసులను పరిష్కరించడంలో పోలీ సుల సమన్వయ లోపముంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, సీసీఆర్బీ ఏసీపీ జి.విజయ్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్ ఫర్ ప్రాసిక్యూషన్ డి.శరత్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ జె.శ్రీరాములు, అడిషనల్ పీపీలు రాములు, గౌరు రాజిరెడ్డి, కుమారస్వామి, ఝాన్సీ, ఏపీపీలు గాయత్రి, వీరాస్వామి, రంజిత్ కుమార్, సీఐ సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.
రిటర్నింగ్ అధికారులకు శిక్షణ
కరీంనగర్ అర్బన్: బూత్ లెవెల్ ఆఫీసర్ల ఎంపిక, అర్హతలు, నిర్వర్తించాల్సిన విధులు, బాధ్యతలకు సంబంధించి ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు భారత ఎన్నికల సంఘం మంగళవారం ఆన్‌లైన్ శిక్షణ ఇచ్చింది. బీఎల్‌వోల ఎంపికలో అనుసరించాల్సిన విధానం, ఉండాల్సిన అర్హతలు, వారు నిర్వర్తించవలసిన విధులు, ఓటర్లకు ఏ విధంగా సహకరించాలనే అంశాలపై ఎలక్షన్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. వచ్చే నెల 2న బూత్ లెవెల్ ఆఫీసర్లకు జిల్లాల వారీగా ఈఆర్వోల ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహించనున్నారు. కరీంనగర్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఈ ఆన్‌లైన్ శిక్షణ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్‌బాబు పాల్గొన్నారు.
దోమల నివారణకు చర్యలు చేపట్టాలి
కరీంనగర్‌టౌన్: వర్షాకాలం నేపథ్యంలో దోమలు పుట్టకుండా, కుట్టకుండా చర్యలు చేపట్టాలని డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటరమణ పిలుపునిచ్చారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలో మంగళవారం ప్రాథమిక, పట్టణ ఆరోగ్యకేంద్రం వైద్యాధికారులకు ఎంఎల్‌హెచ్‌పీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు, దోమల నిర్మూలనకు పంచాయతీరాజ్, మున్సిపల్‌శాఖతో కలిసి ప్రజారోగ్యం మెరుగుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 16 తేదీ నుంచి జూలై 31వరకు 45 రోజులపాటు ‘స్టాప్ డయేరియా’ కార్యక్రమం జిల్లాలో జరుగుతుందన్నారు. పిల్లలకు విరేచనాలు సోకినట్లయితే వోఆర్‌ఎస్, జింక్ మాత్రలు అందించాలన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ సుధా, రవీందర్ రెడ్డి, ఉమాశ్రీ, సాజిద, చందు, సనజవేరియా, విప్లవ శ్రీ, రాజ గోపాల్, స్వామి, కై క పాల్గొన్నారు.
కొర్రమీను చేపల పెంపకంపై శిక్షణ
కరీంనగర్ అర్బన్: కొర్ర మీను చేపల పెంపకంపై కలెక్టరేట్ ఆడిటోరియంలో శిక్షణ ప్రారంభమైంది. కొర్రమీను హెచరీ యాజమాన్యం, పెంపకం పద్ధతులపై మూడు రోజుల పాటు శిక్షణ జరగనుండగా అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ హాజరై పలు సూచనలు చేశారు. చేప పిల్లల ఉత్పత్తి, నూతన పద్ధతిలో చేపల పెంపకంపై అవగాహన కల్పించారు. మత్స్యశాఖ అడిషనల్ డైరెక్టర్ మురళీకష్ణ, ఎన్‌ఎఫ్డీబీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ దీప, సీఐబీఐ సీనియర్ సైంటిస్ట్ రాజేశ్, నాబార్డ్ ఇన్‌చార్జి అర్పిత, నాబార్డ్ ఏజీఎం జయప్రకాశ్, జిల్లా మత్స్యశాఖ అధికారి భారతి, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు పిట్టల రవీందర్ పాల్గొన్నారు.
పీపీలతో సీపీ సమావేశం
పీపీలతో సీపీ సమావేశం
పీపీలతో సీపీ సమావేశం


