సమ్మక్క జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలి
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ పరి ధిలో సమ్మక్క సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. గురువారం రేకుర్తి,హౌసింగ్‌బోర్డుకాలనీల్లోని జాతర నిర్వహించే ప్రాంతాలను సందర్శించారు. జనవరిలో నిర్వహించే సమ్మక్క, సారలమ్మ వనదేవతల జాతరకు ఘనంగా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. డీఈ లచ్చిరెడ్డి పాల్గొన్నారు.
కరీంనగర్‌టౌన్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో ఆమోదించిన బీమారంగంలో 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల బిల్లు దేశ ఆర్థిక వ్యవస్థకు, సామాన్యుల పొదుపు భద్రతకు అతిపెద్ద విఘాతంగా పరిణమించనున్నదని ఎల్‌ఐసీ యూనియన్ జాతీయ ఉపాధ్యక్షుడు సతీశ్ అన్నారు. బిల్లు, బీమా చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని ఎల్‌ఐసీ డివిజనల్ కార్యాలయం ఎదుట గురువారం నిరసన తెలిపారు. ఇప్పటివరకు ఉన్న 74శాతం పరిమితిని 100శాతం చేయడం వల్ల విదేశీ పెట్టుబడులు వరదలా వచ్చి పడతాయ ని, కొత్త టెక్నాలజీ ఉపయోగంలోకి వస్తుందని, ఇన్సూరెన్స్ విస్తరణ మరింతగా దేశం నలుమూలలకు పెరుగుతుందని ప్రభుత్వం చెబుతున్న కారణాలు అబద్ధాలని రుజువైందన్నారు. రామ్మోహన్‌రావు, సూర్యకళ, వామన్‌రావు, బసవేశ్వర్, అనుపమ పాల్గొన్నారు.
పత్తి మార్కెట్‌కు మూడురోజులు సెలవు
జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ మార్కె ట్లో క్వింటాల్ పత్తి ధర గరిష్టంగా రూ.7,450 పలికింది. గురువారం మార్కెట్‌కు 19వాహనాల్లో 144 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకాని కి తెచ్చారు. మోడల్ ధర రూ.7,200, కనిష్ట ధర రూ.6,800కు వ్యాపారులు కొనుగోలు చే శారు. మార్కెట్‌కు శుక్రవారం అమావాస్య, శని, ఆదివారాలు సెలవులుంటా యని, సోమవారం యథావిధిగా కొనుగోళ్లు జరుగుతాయ ని ఇన్‌చార్జి కార్యదర్శి రాజా పేర్కొన్నారు.
27న ఎస్‌యూలో మెగా జాబ్‌మేళా
సప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన యూనివర్సిటీలో ఈనెల 27న మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు వీసీ ఉమేశ్ కుమార్ తెలిపారు. శాతవాహన వర్సిటీ, నిపుణ హ్యూమన్ డెవలప్‌మెంట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో వర్సిటీ ఆవరణలో ఉదయం 10 గంటలకు కార్యక్రమం ఉంటుందన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మసీ, నర్సింగ్, హాస్పిటాలిటీ, బ్యాంకింగ్, రిటైల్, ఎఫ్‌ఎంసీజీ, మేనేజ్‌మెంట్ వంటి 50కి పైగా కార్పొరేట్ కంపెనీల్లో 5వేలకు పైగా ఉద్యోగాల్లో నియామకాలు ఉంటాయన్నారు. డిగ్రీ, పీజీ, బీటెక్, ఎంటెక్ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సమ్మక్క జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలి
సమ్మక్క జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలి


