పంచాయతీ కిక్కు రూ.151కోట్లు
కరీంనగర్‌క్రైం: జిల్లాలో మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికలు ఎకై ్సజ్‌శాఖకు కాసులవర్షం కురిపించాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా రూ.151 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎకై ్సజ్ గణాంకాలు చెబుతున్నాయి. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 27వ తేదీన విడుదల కాగా... డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. జిల్లాలో 94 మద్యం దుకాణాలు, 34 బార్లు ఉన్నాయి. 17 రోజుల వ్యవధిలో ఎన్నికల సందర్భంగా 1,16,963 కాటన్ల మద్యం, 1,57,659 కాటన్ల బీర్లు అమ్ముడయ్యాయని ఎకై ్సజ్ వర్గాల ద్వారా తెలిసింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మూడు దఫాలుగా పోలింగ్ జరిగింది. ఆయా ప్రాంతాల్లో రెండు రోజులు మద్యం దుకాణాలు మూసివేశారు. ఆయా సందర్భాల్లో పక్క ప్రాంతాల నుంచి మద్యం కొనుగోలు చేసుకెళ్లారు. మొత్తంగా కొత్త మద్యం పాలసీలో దుకాణాలు దక్కించుకున్న వారు పంచాయతీ ఎన్నికల సందర్భంగా బోణీ కొట్టగా మంచి ఆదాయం సమకూరుతోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మున్ముందుకు మరిన్ని ఎన్నికలు ఉండడంతో ఢోకా లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పంచాయతీ కిక్కు రూ.151కోట్లు
పంచాయతీ కిక్కు రూ.151కోట్లు


