త్రుటిలో తప్పిన ప్రమాదం
హుజూరాబాద్: హుజురాబాద్ మండలంలోని సింగాపూర్ గ్రామ శివారులో కరీంనగర్ – వరంగల్ రహదారిపై మంగళవారం ఆయిల్ ట్యాంకర్ ట్రాలీ ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో ఆటో ట్రాలీ బోల్తాపడడంతో రోడ్డుపై సిలిండర్లు చెల్లాచెదురగా పడిపోయాయి. కాగా కొన్ని సిలిండర్ల నుంచి గ్యాస్ లీకై ంది. అయినా అవి పేలకపోవడంతో ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు. కాగా ట్యాంకర్ డ్రైవర్ పారిపోయాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అరుణాచల గిరి ప్రదక్షిణ యాత్రకు ప్రత్యేక బస్సు
హుజూరాబాద్: అరుణాచల గిరి ప్రదక్షిణ యాత్రకు హుజూరాబాద్ ఆర్టీసీ డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సు సౌకర్యం ఈ నెల 9 నుంచి ఉంటుదని, ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని హుజూరాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ మంగళవారం తెలిపారు. ఈనెల 9న మధ్యాహ్నం 2గంటలకు స్థానిక బస్‌స్టేషన్ నుంచి బస్సు బయలుదేరి కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం, మరుసటి రోజు 10న రాత్రి వరకు అరుణాచలం చేరుకుంటుందన్నారు. 11న అరుణాచల గిరి ప్రదక్షిణ అనంతరం తిరిగి సాయంత్రం 4 గంటలకు అరుణాచలంలో బయలుదేరి 12న హుజూరాబాద్‌కి బస్ చేరుకుంటుందని డీఎం రవీంద్రనాథ్ వివరించారు. సూపర్ లగ్జరీ బస్ చార్జి పెద్దలకు రూ.4,500, పిల్లలకు రూ.3,800 ఉంటుందని, అడ్వాన్స్ బుకింగ్ కోసం 99592 25924, 97048 33971, 92471 59535, 94414 04841 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం కుడా ఉందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


