ఆస్తులు పంచుకున్నారు.. అన్నం పెడ్తలేరు
ప్రజావాణి ఉందనుకుని కరీంనగర్ కలెక్టరేట్‌కు వచ్చిన వృద్ధ దంపతులకు చుక్కెదురైంది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గంగిపల్లి గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు రేగుల్ల నర్సయ్య– లక్ష్మిని కొడుకులు ఆస్తులు పంచుకుని గెంటేశారు. తమ కొడుకులు బుక్కెడు బువ్వ పెట్టడం లేదని ప్రజావాణిలో దరఖాస్తు ఇద్దామని సోమవారం కలెక్టరేట్‌కు వచ్చారు. భూ భారతి కార్యక్రమం ఉండటంతో ప్రజావాణిని అధికారులు రద్దు చేశారు. చేసేది ఏమీ లేక కలెక్టరేట్‌లోని చెట్లనీడ కింద కూర్చుని కన్నీటి పర్యంతమయ్యారు. కై కిలి చేసుకొని బతుకుదామన్నా.. వయస్సు సహకరిస్తాలేదంటూ కన్నీటితో వెనుదిరిగారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్


