TS Election 2023: 'భారత రాష్ట్ర సమితి'లో.. ముగ్గురు కొత్తవారు!

- - Sakshi

కరీంనగర్‌: భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) తన అభ్యర్థులను ప్రకటించింది. 13 అసెంబ్లీ స్థానాలున్న విశాల ఉమ్మడి జిల్లా అభ్యర్థుల జాబితాను సోమవారం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రకటించగానే.. పాత జిల్లాలో గులాబీ శ్రేణుల సంబురాలు మొదలయ్యాయి. ఇటీవల జాబితాలో ఉమ్మడి జిల్లాలో భారీగా మార్పులు ఉంటాయని ప్రచారం జరిగిన నేపథ్యంలో సీఎం జాబితాపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

కానీ.. పాత జిల్లాలో పదిమందిని పాత వారిని, ముగ్గురు కొత్తవారి పేర్లు ప్రకటించి సీఎం.. అందరి అంచనాలను తలకిందులు చేశారు. అంతా ఊహించినట్లుగా వేములవాడ అభ్యర్థిని అందరి కంటే ముందే మారుస్తున్నామని సీఎం ప్రకటించారు. పౌరసత్వం వివాదంలో ఆయన మార్పు అనివార్యమైందని వివరించారు. ఆయన స్థానంలో చెలిమెడ లక్ష్మీనర్సింహారావు పేరును ఖరారు చేశారు.

కోరుట్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే కె.విద్యాసాగర్‌రావు కుమారుడు డాక్టర్‌ కె.సంజయ్‌ను ప్రకటించారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న విద్యాసాగర్‌రావు కోరిక మేరకు సంజయ్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఇక హుజూరాబాద్‌లో అంతా అనుకున్నట్లుగా ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డిని ఖరారు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు సిట్టింగులను మార్చగా ఇందులో జిల్లాకు చెందినవారే ఇద్దరు కావడం విశేషం.

పదిమంది పాతకాపులే..
ఉమ్మడి జిల్లాలో మొత్తం 13 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో మూడుస్థానాల్లో అభ్యర్థులు మారగా, మిగిలిన 10 స్థానాల్లో సీనియర్లే ఉన్నారు. అందులో సిరిసిల్ల నుంచి మంత్రి కేటీఆర్‌, కరీంనగర్‌ నుంచి మంత్రి గంగుల కమలాకర్‌, ధర్మపురి నుంచి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పోటీచేస్తారు.

చొప్పదండి నుంచి సుంకె రవిశంకర్‌, మానకొండూరు నుంచి రసమయి బాలకిషన్‌, హుస్నాబాద్‌ నుంచి సతీశ్‌బాబు, జగిత్యాల నుంచి సంజయ్‌, పెద్దపల్లి నుంచి దాసరి మనోహర్‌రెడ్డి, రామగుండం నుంచి కోరుకంటి చందర్‌, మంథని నుంచి పుట్ట మధు బరిలో దిగనున్నారు. ఇందులో సిరిసిల్ల, కరీంనగర్‌, హుస్నాబాద్‌, మానకొండూరు, జగిత్యాల మినహా మిగిలిన చొప్పదండి, ధర్మపురి, పెద్దపల్లి, రామగుండం, మంథనిలో ఎమ్మెల్యేలకు వ్యతిరేక పవనాలు వీచాయి.

మంత్రి ఈశ్వర్‌ పెద్దపల్లి పార్లమెంటుకు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అదే సమయంలో చొప్పదండి, రామగుండం, మంథని, పెద్దపల్లి ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా స్థానిక నేతలు తిరుగుబాటు చేశారు. మంత్రులు కేటీఆర్‌, గంగుల కమలాకర్‌, ఈశ్వర్‌ల చొరవతో అవన్నీ సద్దుమణిగాయి.

కులాల వారీగా..
13 అసెంబ్లీ స్థానాల్లో ఏడుగురు ఓసీ అభ్యర్థులు ఉన్నారు. ముగ్గురు బీసీలు, ముగ్గురు ఎస్సీలకు అవకాశం దక్కింది. ఇందులో కేటీఆర్‌, డాక్టర్‌ సంజయ్‌, డాక్టర్‌ కె.సంజయ్‌కుమార్‌, చలిమెడ లక్ష్మీనర్సింహరావు వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు. పెద్దపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి, హుజూరాబాద్‌ నుంచి పాడి కౌశిక్‌ది రెడ్డి సామాజిక వర్గం.

హుస్నాబాద్‌ నుంచి సతీశ్‌బాబు బ్రాహ్మణ(కరణం) కాగా, కరీంనగర్‌ నుంచి కమలాకర్‌, రామగుండం నుంచి కోరుకంటి చందర్‌, మంథని నుంచి పుట్ట మధు.. ఈ ముగ్గురూ మున్నూరుకాపు సామాజికవర్గం వారు కావడం విశేషం. సుంకె రవిశంకర్‌(చొప్పదండి), రసమయి బాలకిషన్‌(మానకొండూరు) మాదిగ, కొప్పుల ఈశ్వర్‌(ధర్మపురి) మాల సామాజిక వర్గానికి చెందివారు కావడం గమనార్హం.

ఏడుగురు మూడోసారి..
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పాతజిల్లాలోని 13 అసెంబ్లీ స్థానాల్లో ఏడుగురు నాయకులు బీఆర్‌ఎస్‌ టికెట్‌పై మూడోసారి పోటీ చేస్తున్నారు. అందులో కేటీఆర్‌(సిరిసిల్ల), సతీశ్‌బాబు(హుస్నాబాద్‌), మనోహర్‌రెడ్డి(పెద్దపల్లి), పుట్ట మధు(మంథని), గంగుల కమలాకర్‌ (కరీంనగర్‌), కొప్పుల ఈశ్వర్‌(ధర్మపురి), రసమయి బాలకిషన్‌ (మానకొండూరు) ఉన్నారు.

డాక్టర్‌ సంజయ్‌(జగిత్యాల), సుంకె రవిశంకర్‌(చొప్పదండి) రెండోసారి బీఆర్‌ఎస్‌ టికెట్‌పై బరిలోకి దిగనున్నారు. ఇక మిగిలిన నలుగురు లక్ష్మీనర్సింహారావు(వేములవాడ), పాడికౌశిక్‌రెడ్డి(హుజూరాబాద్‌), డాక్టర్‌ కె.సంజయ్‌ (కోరుట్ల), కోరుకంటి చందర్‌(రామగుండం) తొలిసారిగా బీఆర్‌ఎస్‌ బీఫాం మీద పోటీ చేయనున్నారు.

Read latest Karimnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

11-11-2023
Nov 11, 2023, 07:57 IST
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయా లని ఆశించి టికెట్‌ రాక భంగపడిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలను ఏఐసీసీ...
11-11-2023
Nov 11, 2023, 07:38 IST
సాక్షి, ఆదిలాబాద్‌: కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి భంగపడ్డ అల్లూరి సంజీవ్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. శుక్రవారం ఆయన...
11-11-2023
Nov 11, 2023, 07:02 IST
ఖమ్మం: ఉమ్మడి జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు తొలిసారిగా కారు గుర్తుపై బరిలోకి దిగుతున్నారు. వీరిలో కొందరు గత ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీడీపీ...
11-11-2023
Nov 11, 2023, 06:50 IST
హైదరాబాద్: శేరిలింగంపల్లి నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి మారబోయిన రవికుమార్‌ యాదవ్‌ స్థిరచరాస్తుల విలువ అక్షరాల రూ.151 కోట్లకు పైమాటే. అప్పు...
11-11-2023
Nov 11, 2023, 06:35 IST
సూర్యాపేట : బీఆర్‌ఎస్‌ సూర్యాపేటఅభ్యర్థి, రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి గురువారం వేసిన నామినేషన్‌లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు....
11-11-2023
Nov 11, 2023, 05:32 IST
సాక్షి, హైదరాబాద్‌: నామినేషన్ల దాఖలు చివరిరోజు అభ్యర్థుల జాబితాలో కొన్ని మార్పులు చేసి, ఇదివరకే ప్రకటించిన వారికి బీఫాంలు ఇవ్వకపోవడం...
11-11-2023
Nov 11, 2023, 05:23 IST
సిర్పూర్‌(టి)/కౌటాల, సిరిసిల్ల: కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనని, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎన్నికల ఖర్చును బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆరే పెడుతున్నారని...
11-11-2023
Nov 11, 2023, 05:15 IST
సాక్షి, న్యూఢిల్లీ:  అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల చివరి రోజున బీజేపీ అధిష్టానం విడుదల చేసిన పార్టీ అభ్యర్థుల ఐదో జాబితా...
11-11-2023
Nov 11, 2023, 04:47 IST
కాచిగూడ (హైదరాబాద్‌): పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ డిసెంబర్‌...
11-11-2023
Nov 11, 2023, 04:24 IST
హుజూరాబాద్‌: రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కావాలో.. సంక్షోభం సృష్టించే పార్టీలు కావాలో ప్రజలే ఆలోచించాలని...
10-11-2023
Nov 10, 2023, 20:15 IST
సాక్షి, హుజురాబాద్ : హుజురాబాద్‌లో సర్వేలన్నీ కౌశిక్ రెడ్డికి మొదటి స్థానాన్ని ఇస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇక్కడ కాంగ్రెస్ రెండవ స్థానంలో ఉందని, బీజేపీ అయితే...
10-11-2023
Nov 10, 2023, 17:29 IST
మైనారిటీలను బీసీల్లో చేరుస్తామని కాంగ్రెస్‌ చేసిన ప్రతిపాదన వెంటనే వెనక్కి.. 
10-11-2023
Nov 10, 2023, 15:29 IST
2018 ఎన్నికలకు  2,644 నామినేషన్లు రాగా.. ఈసారి నిన్నటితోనే ఏకంగా.. 
10-11-2023
Nov 10, 2023, 12:41 IST
సాక్షి, సూర్యాపేట: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఎంతో మంది నేతలు సిద్ధమయ్యారు. గత ఐదేళ్లుగా పార్టీనే నమ్ముకుని.. ప్రజలతో...
10-11-2023
Nov 10, 2023, 12:08 IST
పరకాల: ప్రధాన పార్టీల అభ్యర్థులంతా గురువారం ఏకాదశి కావడంతో మంచిరోజు అని.. నామినేషన్లు వేసేందుకు ఎన్నికల రిటర్నింగ్‌ కార్యాలయానికి చేరుకున్నారు....
10-11-2023
Nov 10, 2023, 06:25 IST
మధిర/సాక్షి, హైదరాబాద్‌: ఖమ్మం జిల్లాకు చెందిన దివంగత మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావుకు వచ్చిన అవకాశం, మళ్లీ తనకు దక్కనుందని...
10-11-2023
Nov 10, 2023, 06:16 IST
సాక్షి, హైదరాబాద్‌: నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియగానే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమవుతోంది. ఏఐసీసీ అగ్రనేతలు...
10-11-2023
Nov 10, 2023, 05:50 IST
సాక్షి, సిద్దిపేట: ‘అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి చేతుల్లో ఉంటే ఎలా క్షేమంగా ఉంటదో సీఎం కేసీఆర్‌ చేతుల్లో రాష్ట్రం...
10-11-2023
Nov 10, 2023, 05:46 IST
సిరిసిల్ల/ కొడంగల్‌: తెలంగాణ 60ఏళ్ల గోస పోయేలా సీఎం కేసీఆర్‌ పోరాడి రాష్ట్రాన్ని సాధించారని.. తెలంగాణ కోసం మాట్లాడే ఏకైక...
10-11-2023
Nov 10, 2023, 05:40 IST
సాక్షి, సిద్దిపేట/ సాక్షి, కామారెడ్డి: బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన పేరిట విడిగా సొంత కారు, ద్విచక్ర వాహనం,...



 

Read also in:
Back to Top