బోధన్ రూరల్ : చిన్నపాటి విద్యుత్ నిర్లక్ష్యం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. బ ట్టలు ఆరేసుకునేందుకు కట్టిన ఇనుప తీగకు విద్యుత్ సరఫరా కావడంతో దంపతులు ప్రాణా లు కోల్పోయిన ఘటన ఊట్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రత్నావత్ సంజీవ్ (46) తన కుటుంబంతో కలిసి వ్యవసాయం, పాడి ఆధారంగా జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు ఇద్ద రు భార్యలు. పెద్ద భార్య జ్యోతి (44), చిన్న భార్య తిరుమల (35) ఉన్నారు. జ్యోతికి ముగ్గురు కూతు ళ్లు గోదావరి, శ్వేత, సంధ్యారాణి ఉన్నారు. రెండో భార్యకు కూతురు, కొడుకు సంతానం ఉన్నారు. కుటుంబ అవసరా ల కోసం ఇంటి ముందు ఖాళీ స్థలంలో గేదెల కోసం రేకుల షెడ్ నిర్మించి అందులో ఫ్యాన్లు ఏ ర్పాటు చేశారు. అదే షెడ్డుకు బట్టలు ఆరేసుకోవడానికి జీఏ వైరు కట్టి దానిపై ప్రతిరోజూ బట్టలు ఆరేసుకునేవారు. ఎప్పటిలాగే ఆదివారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో చిన్న భార్య తిరుమల వైరు మీద ఉన్న బట్టలు తీస్తుండగా స్వల్పంగా కరెంట్ షాక్ తగిలింది. వెంటనే ఈ విషయాన్ని భర్త సంజీవ్‌కు చెప్పింది. దీంతో సంజీవ్ వైరు దగ్గరకు వెళ్లి చూడగా, ప్రమాదవశాత్తు అతడికి విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు. సమీపంలో ఉన్న పెద్ద భార్య జ్యోతి భర్తను కాపాడాలనే హడావుడిలో ఆ వైర్‌ను పట్టుకోవడంతో ఆమెకు కూడా విద్యుత్ షాక్ తగిలింది. క్షణాల్లో జరిగిన ఈ ఘటనతో భార్యాభర్తలిద్దరూ అక్కడిక్కడే ప్రాణాలొదిలారు. కుటుంబానికి అండగా నిలిచిన తల్లిదండ్రులు ఒక్కసారిగా దూరం కావడంతో పిల్లల రోదనలు అందరినీ కలచివేశాయి. కుమార్తె గోదావరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీఐ విజయ్, ఎస్సై రాజశేఖర్ ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను బోధన్ జిల్లా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. విద్యుత్ ప్రమాదంపై బోధన్ ట్రాన్స్‌కో డీఈ ముక్తార్‌ను ‘సాక్షి’ సంప్రదించగా పోలీస్ కేసు నమోదైన నేపథ్యంలో బాధిత కుటుంబానికి పరిహారం కోసం ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని ఆయన తెలిపారు.
బట్టలు ఆరేసిన తీగే బలితీసుకుంది
విద్యుత్ షాక్‌తో భార్యాభర్తల మృతి
క్షణంలో కుటుంబం చిన్నాభిన్నం..
బోధన్ మండలం ఊట్‌పల్లిలో ఘటన
గ్రామంలో విషాదఛాయలు


