‘ఐడీఏ ధరలకు దంత వైద్య సేవలు, చికిత్సలు’ | - | Sakshi
Sakshi News home page

‘ఐడీఏ ధరలకు దంత వైద్య సేవలు, చికిత్సలు’

Jun 23 2026 1:28 AM | Updated on Jun 23 2026 1:28 AM

కామారెడ్డి అర్బన్‌: దంత వైద్యులందరూ ఇండియన్‌ డెంటల్‌ అసోసియేషన్‌(ఐడీఏ) నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలని అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు అచ్చుకట్ల జీవన్‌, ప్రధాన కార్యదర్శి నిమ్మ అభిషేక్‌ రెడ్డిలు అన్నారు. ఆదివారం రాత్రి ఐడీఏ జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో దంతవైద్యుల వివిధ సమస్యలపై చర్చించారు. ఇష్టానుసారం కాకుండా అసోసియేష న్‌ నిర్ణయించిన ధరలను ప్రదర్శించి ఆ మేరకు దంత రోగులకు సేవలు, చికిత్సలు అందించాలని తీర్మానించారు. సమావేశంలో అసోసియేషన్‌ సీనియర్‌ సభ్యులు ఎం.మల్లికార్జున్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాజిద్‌, మాధవి, స్వాతి, సారా, కోశాధికారి కవిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement