పేదల అభ్యున్నతే కాంగ్రెస్‌ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పేదల అభ్యున్నతే కాంగ్రెస్‌ లక్ష్యం

Jun 23 2026 1:28 AM | Updated on Jun 23 2026 1:28 AM

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌ రావు

పలు అభివృద్ధికి పనులు ప్రారంభం

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): పేదల అభ్యున్నతే కాంగ్రెస్‌ లక్ష్యమని ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌ రావు అన్నారు. సోమవారం ధర్మారావ్‌పేట్‌లో ఆరోగ్య ఉప కేంద్ర భవనాన్ని, లింగంపల్లిలో గ్రామ పంచాయతీ భవనం, తిమ్మోజీవాడిలో ఇందిరమ్మ గృహాలు, సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. తుక్కోజీవాడిలో మహిళ సమాఖ్య భవనానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. అర్హులైన వారికే ఇందిరమ్మ గృహాలను మంజూరు చేస్తున్నామన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయడానికి ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో మహిళా సమాఖ్య భవన నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడు నల్ల మహిపాల్‌ రెడ్డి, మాజీ వైస్‌ ఎంపీపీ గాదారి శ్రీనివాస్‌ రెడ్డి, సేవాదళ్‌ అధ్యక్షుడు లింగాగౌడ్‌, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మద్దెల బాగయ్య, తిమ్మోజివాడి సర్పంచ్‌ నందిపేట భవాని, ఉప సర్పంచ్‌ రవీందర్‌ రావు, సదాశివనగర్‌ ఉప సర్పంచ్‌ ప్రవీణ్‌కుమార్‌, తుక్కోజివాడి సర్పంచ్‌ సంగారావు, తదితరులు పాల్గొన్నారు.

గ్రామ స్థాయి నుంచే కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి

రామారెడ్డి(ఎల్లారెడ్డి): గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయాలని ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం రామారెడ్డిలో మండల నూతన కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని డీసీసీ జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్‌ పటేల్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీని మరింతగా బలోపేతం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే సేవా వేదికగా మండల పార్టీ కార్యాలయం నిలవాలని ఆకాంక్షించారు. అంతకు ముందు గంగమ్మవాగు బిడ్జ్రిని పరిశీలించి పెండింగ్‌ పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సర్పంచ్‌లు బండి ప్రవీణ్‌, నవీన్‌, ఉప సర్పంచులు దోకి లచ్చయ్య, రమేష్‌, మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement