కామారెడ్డి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్ల అసోసియేషన్ డిమాండ్ చేసింది. సోమవారం అడిషనల్ కలెక్టర్ ఎన్వీ గిరికి అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంత్‌రెడ్డి, విజయరామరాజులు వినతి పత్రాలు అందజేశారు. 2024 నుంచి ఉద్యోగ విరమణ చేసిన వారికి అందాల్సిన బెనిఫిట్లు వెంటనే విడుదల చేయాలన్నారు. హెల్త్‌కార్డులు అమల్లోకి రాకముందే 1.5 శాతం కోత విధించడం ఎంత వరకు సమంజసమన్నారు. పెన్షనర్ల డబ్బులను ఇతర రంగాలకు మళ్లించడాన్ని నిలిపివేయాలని, సమన్వయకర్త కమిటీ నియమించి పీఆర్‌సీ అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకులు జి.లచ్చయ్య, రవీందర్, సత్యనారాయణ, సుబ్రహ్మణ్యం, రాజలింగయ్య, సత్తయ్య తదితరులు మాట్లాడారు.
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో ఈ నెల 23న యూరియా యాప్‌ను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ముదాం నర్సిములు తెలిపారు. ఆయన సోమవారం తాడ్వాయిలో మాట్లాడారు. కామారెడ్డి –ఎల్లారెడ్డి ప్రధాన రహదారిలో ధర్నా నిర్వహించడమే కాకుండా వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ధర్నాకు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌లు ముఖ్య అతిథులుగా హాజరవుతారన్నారు. సింగిల్ విండో చైర్మన్ కపిల్‌రెడ్డి, సర్పంచ్ మంగారెడ్డి, ధర్మారెడ్డి, మంగారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రాజిరెడ్డి, గోపాల్‌రావు, రాములు, రాజుగౌడ్, తదితరులు పాల్గొన్నారు.


