భిక్కనూరు : రాజంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద సోమవారం రైతులు యూరియా కోసం ఆందోళన చేపట్టారు. యాప్ ద్వారా బుక్ చేసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. యాప్‌తో సంబంధం లేకుండా ఎకరానికి రెండు బస్తాల యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అయితే, రాజంపేట గ్రామానికి చెందిన ఓ రైతు యూరియా కోసం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. సొసైటీ సిబ్బంది, పోలీసులు ఆ రైతు వద్దనున్న పెట్రోల్ బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ జానకీ, ఏడీఏ అపర్ణ, ఏవో జ్యోత్స్న సొసైటీ వద్దకు చేరుకొని రైతులను సముదాయించారు. ఏవో జ్యోత్స్న మాట్లాడుతూ సొసైటీ పరిధిలో 60 టన్నుల యూరియా అందుబాటులో ఉందని, మంగళవారం రైతులకు పంపిణీ చేస్తామని తెలిపారు.
మక్కల డబ్బుల కోసం మరో రైతు..
గాంధారి(ఎల్లారెడ్డి): మక్కల డబ్బులు ఖాతాల్లో జమ కాలేదని మండల కేంద్రానికి చెందిన రైతు చిల్లాల గోపాల్ అనే రైతు సోమవారం స్థానిక సింగిల్ విండో కార్యాలయ సిబ్బందితో గొడవకు దిగా డు. అందరితోపాటు జమ అవుతాయని నచ్చజెప్పి నా వినకుండా హంగామా చేశాడని, బాటిల్‌లో వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకొని కార్యాయలంలో కూడా పెట్రోల్ చల్లినట్లు సిబ్బంది తెలిపారు.సమాచారం అందుకున్న ఏఎస్సై ప్రకాశ్ ఘ టనా స్థలానికి చేరుకొని రైతును స్టేషన్‌కు తీసుకొ చ్చి నచ్చజెప్పారు. కాగా, ఈ విషయమై విండో కార్యదర్శి సాయిలును వివరణ కోరగా కాంటా చేసి మక్కలు మార్క్ గోదాములకు పంపించామని, మార్క్‌ఫెడ్ అధికారులు జమచేస్తారని తెలిపారు. మార్క్‌ఫెడ్ డీఎం క్రాంతిని సంప్రదించగా మూడు రోజుల్లో రైతులందరికీ డబ్బులు జమ చేస్తామని చెప్పినట్లు కార్యదర్శి వివరించారు.


