పెద్దకొడప్‌గల్(జుక్కల్): మండలంలోని పెద్ద దేవిసింగ్ తండాలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా తయారైంది. అంతర్గత డ్రైనేజీలు లేకపోవడంతో నెలల తరబడి రోడ్లపైనే మురికి నీరు పారుతు న్నాయి. దీంతో దోమల సంఖ్య గణనీయంగా పె రిగిపోయింది. పారిద్ధ్యానికి సంబంధించిన ఎటువంటి పనులు, దోమల నివారణ చర్యలు చేపట్టడం లేదు. దీంతో నీరు నిలువ ఉండి తండాలో రోడ్లు బురద కంపు కొడుతోంది..దోమల బెడద పెరిగింది. ఇప్పటికై న అధికార యంత్రాంగం దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇందిరమ్మ కాలనీలో..
నస్రుల్లాబాద్: దుర్కి గ్రామంలో గల ఇందిరమ్మ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. దీంతో మురికి నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. రాబోయేది వర్షాకాలం కావడంతో వ్యాధులు ప్ర బలే అవకాశం ఉంది. వీధులు శుభ్రంగా ఉంచా ల్సిన సిబ్బంది కనీసం కాలనీ వైపు కన్నెత్తి చూడటం లేదు. వీధులన్నీ దుర్వాసన వెదజల్లుతూ కంపు కొడుతున్నాయి. అధికార యంత్రాంగం స్పందించి కాలనీలోని మురికి కాలువలను శుభ్రం చేయించాలని స్థానికులు కోరుతున్నారు.


