ఆర్టీసీ బస్సు ఢీ.. ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీ.. ఒకరి మృతి

Jun 22 2026 1:18 AM | Updated on Jun 22 2026 1:18 AM

మరొకరి పరిస్థితి విషమం

ఆస్పత్రికి తరలింపు

మాచారెడ్డి: ఆర్టీసీ బస్సు, ఓ బైకును ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన ఆదివారం పాల్వంచ బ్రిడ్జి సమీపంలో చోటుచేసుకుంది. మాచారెడ్డి ఎస్సై అనిల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రాజంపేట మండలం షేర్శంకర్‌ తండాకు చెందిన పెంట్యా (28), ఎల్లారెడ్డిపల్లికి చెందిన సక్కుబాయితో కలిసి బైక్‌పై కామారెడ్డి నుంచి మాచారెడ్డి వైపు వెళ్తున్నారు. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సు బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో పెంట్యా అక్కడికక్కడే మృతి చెందగా, సక్కుబాయికి తీవ్రగాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై వివరించారు. పెంట్యా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement