అశోక్‌సాగర్‌లో పడి బ్యాంక్‌ అధికారి మృతి | - | Sakshi
Sakshi News home page

అశోక్‌సాగర్‌లో పడి బ్యాంక్‌ అధికారి మృతి

Jun 22 2026 1:18 AM | Updated on Jun 22 2026 1:18 AM

నిజామాబాద్‌ అర్బన్‌: నగర శివారులోని అశోక్‌సాగర్‌లో పడి ఎస్‌బీఐ అసిస్టెంట్‌ మేనేజర్‌ మృతి చెందినట్లు ఆరో టౌన్‌ ఎస్సై సందీప్‌ తెలిపారు. ప్రగతి భవన్‌ బ్రాంచీలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పని చేస్తున్న కొటారి శ్రీధర్‌ ఆదివారం ఉదయం 6 గంటలకు వాకింగ్‌కు వెళ్లి తిరిగి రాలేదు. అశోక్‌సాగర్‌లో సాయంత్రం 6 గంటలకు ఓ మృతదేహం కనిపించిందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గుర్తింపు కార్డు ఆధారంగా శ్రీధర్‌ వివరాలు తెలుసుకున్నారు. వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కాలకృత్యాలకు వెళ్లి అశోక్‌సాగర్‌లో పడి ఈతరాక మృతి చెందినట్లు భార్య కొటారి లత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై సందీప్‌ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement