దారి చూపాడు... | - | Sakshi
Sakshi News home page

దారి చూపాడు...

Jun 21 2026 6:28 AM | Updated on Jun 21 2026 6:28 AM

చదువుకుంటే ఉన్నతంగా బతకొచ్చని చెబుతాడు..

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ‘మాది ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఖుషీనగర్‌ జిల్లాలో పడెరోనా అనే చిన్న పట్టణం. నాన్న వ్యవసాయంతోపాటు వ్యవసాయానికి సంబంధించిన పనిముట్ల వ్యాపారం చేసేవారు. పదో తరగతి వరకు మా ఊళ్లోనే చదువుకున్నాను. చదు వు విలువ తెలిసిన నాన్న లెవంత్‌ క్లాస్‌ చదువుకోసం 1500 కిలోమీటర్ల దూరాన ఉ న్న రాజస్థాన్‌లోని కోటకు పంపించారు. అక్కడ ఐఐటీ ల క్ష్యంగా చదివి ముంబ యి ఐఐటీలో సీటు సా ధించా’ అని 2019 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్‌ అధికారి, కా మారెడ్డి డీఎఫ్‌వో నీరజ్‌కుమార్‌ టిబ్రేవాల్‌ అన్నారు. ఫాదర్స్‌ డే సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చి న ఇంటర్వ్యూలో ‘నాన్న చూపిన దారిలో నడవడం వల్లే ఈ రోజు సివిల్‌ సర్వీసెస్‌ అధికారిగా మీ ముందున్నాను’ అని పేర్కొన్నారు. ‘మా ఊళ్లో కాంపిటెటివ్‌ బుక్స్‌ కూడా దొరికేది కాదు. అలాంటి ఊరు నుంచి ఐఐటీ సీటు సాధించి మా నాన్న గౌ రవాన్ని పెంచాను’ అని తెలిపారు. ముంబై ఐఐటీ లో సీటు రావడంతో నాన్న ఎంతో సంతోషపడ్డారు. ఐఐటీ చదువు పూర్తవగానే చదువుకు సంబంధం లే ని బ్యాంకింగ్‌ రంగంలోకి వెళ్లాను. మంచి ఉద్యోగం సాధించి ఐదేళ్లు పనిచేశాను. తరువాత యూపీఎస్సీకి ప్రిపేర్‌ కావాలనే నా కోరికను నెరవేర్చుకునేందుకు ప్రిపేర్‌ అయ్యాను. మొదట ప్రిలిమినరీ క్లియ ర్‌ కాలేదు. రెండోసారి ప్రిలిమినరీ క్లియర్‌ అయినా మెయిన్స్‌లో సక్సెస్‌ కాలేదు. ఆ సమయంలో నాన్న నాకు ధైర్యాన్నిచ్చారు. మరింత పట్టుదలతో చదివి తే తప్పకుండా సక్సస్‌ అవుతావని భరోసా ఇచ్చా రు. నాన్న ఇచ్చిన ధైర్యం, భరోసాతో మూడో ప్ర యత్నంలో 20వ ర్యాంక్‌తో ఐఎఫ్‌ఎస్‌ సాధించాను. మొదటి పోస్టింగ్‌ ఎఫ్‌డీవోగా ఇల్లందులో లభించింది. అక్కడి నుంచి డీఎఫ్‌వోగా ఆసిఫాబాద్‌లో పనిచేసి, నెలకిందటే కామారెడ్డికి బదిలీపై వచ్చాను అని తెలిపారు.

మా నాన్నకు చదువు విలువ తె లుసు. ఆయన ఉద్యోగం వచ్చి నా కొన్ని పరిస్థితుల వల్ల వ దులుకుని వ్యవసాయ అ నుబంధ పనిముట్ల వ్యా పారంలో స్థిరపడ్డారు. వ్యవసాయం కూడా చే యించాడు. చదువుకుంటే ఉన్నతంగా బత కొచ్చని చెబుతాడు. ఇ ష్టమైన చదువు ఏదైనా స రే చదవాలని చెబుతాడన్నా రు. నాన్న అశోక్‌, అమ్మ రేఖ నాతో పాటు అన్నను చదివించడాని కి వెనుకడుగు వేయలేదు. ఎంత ఖర్చయినా సరే మంచిగా చదువుకుని ఉన్నతంగా ఎదగాలని ఆ కాంక్షించారు. వాళ్లిచ్చిన ప్రోత్సాహంతోనే ఇద్దరం రాణించాం. అన్న బ్యాంకింగ్‌ రంగంలో ఉండగా, నే ను యూపీఎస్సీ ద్వారా ఐఎఫ్‌ఎస్‌ అధికారినయ్యానన్నారు.

ఐఐటీ టార్గెట్‌గా కోటాకు పంపించాడు

ముంబయి ఐఐటీలో సీటు

సాధించగానే సంతోషపడ్డాడు

ఐదేళ్లు ఉద్యోగం చేసి సివిల్స్‌కు

ప్రిపేర్‌ అయ్యా..

మూడో ప్రయత్నంలో

ఐఎఫ్‌ఎస్‌ సాధించా

‘సాక్షి’తో డీఎఫ్‌వో నీరజ్‌ కుమార్‌ టిబ్రేవాల్‌

పిల్లల ఉన్నతి కోసం తల్లిదండ్రులు ఎంతో శ్రమిస్తారు. వాళ్ల మాటను గౌరవించాలి. వాళ్లు చూపిన దారిలో నడవడం ద్వారా ఎన్నో విజయాలు సాధించగలుగుతాం. అయితే తల్లిదండ్రులు కూడా పిల్లల ఇష్టాఇష్టాలను గమనించి వారికి ఇష్టమైన రంగంలో ప్రోత్సహించాలి. చదువు విషయంలో ఒత్తిడికి గురి చేయొద్దు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement