‘సర్‌’ను పకడ్బందీగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’ను పకడ్బందీగా చేపట్టాలి

Jun 21 2026 6:28 AM | Updated on Jun 21 2026 6:28 AM

‘సర్‌’ను పకడ్బందీగా చేపట్టాలి

బాన్సువాడ : ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు నిర్వహించే స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(సర్‌)ను పకడ్బందీగా నిర్వహించాలని బాన్సువాడ ఆర్డీవో రవీందర్‌రెడ్డి సూచించారు. శనివారం బాన్సువాడ రెడ్డి సంఘంలో బీఎల్‌వో, బీఎల్‌ఏ, బీఎల్‌ సూపర్‌వైజర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. బీఎల్‌వోలు ఇంటింటికి తిరుగుతూ ఎన్యూమరేషన్‌ ఫారాలను పంపిణీ చేయాలని, అర్హులైన ఓటర్లను జాబితాలో చేరుస్తూ అనర్హులను జాబితా నుంచి తొలగించాలని సూచించారు. ఓటర్ల వివరాలు మొబైల్‌ యాప్‌లో పొందపర్చాలని సూచించారు. తహసీల్దార్‌ నరేందర్‌గౌడ్‌, శిక్షకులు వెంకటరమణ, కొంతం వెంటేశం ఉన్నారు.

ఎల్లారెడ్డిలో..

ఎల్లారెడ్డి: స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(సర్‌)పై బీఎల్‌వోలకు ఆర్డీవో రొడ్డ ప్రభాకర్‌ అవగాహన కల్పించారు. శనివారం ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాలకు సంబంధించిన బీఎల్‌వోల శిక్షణ కార్యక్రమం మండలంలోని మీసాన్‌పల్లి రైతు వేదికలో నిర్వహించారు. ఈసందర్భంగా ఆర్డీవో మాట్లాడారు. తహసీల్దార్‌ ప్రేమ్‌ కుమార్‌, ట్రైనర్లు శ్రీనివాస్‌, దేవేందర్‌, బీఎల్‌వోలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement