యూరియా యాప్‌ తొలగించాలని బీఆర్‌ఎస్‌ నేతల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

యూరియా యాప్‌ తొలగించాలని బీఆర్‌ఎస్‌ నేతల ఆందోళన

Jun 21 2026 6:28 AM | Updated on Jun 21 2026 6:28 AM

దోమకొండ: యూరియా యాప్‌ను తొలగించాలంటూ మండల కేంద్రంలో శనివారం బీఆర్‌ఎస్‌ నాయకులు ఆందోళన నిర్వహించారు. స్థానిక గాంధీచౌక్‌ నుంచి తహసీల్‌ కార్యాలయం వరకు ర్యాలీ తీశారు. అనంతరం తహసీల్‌ కార్యాలయం ముందు ధర్నా చేశారు. నేతలు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్‌ వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు. యూరియా వచ్చిన అరగంటకే ఖాళీ అవుతుందని, రైతులు యాప్‌లో ఎంత ప్రయత్నం చేసినా యూరియా దొరకడం లేదన్నారు. అనంతరం మండల ఇంచార్జి వ్యవసాయాధికారితో పాటు డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ధర్నా నేపధ్యంలో దోమకొండ పోలీసులు పలువురు బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులను ముందస్తు అరెస్ట్‌ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement