నేడు బ్యాడ్మింటన్ అకాడమీలో..
నిజాంసాగర్/నాగిరెడ్డిపేట/దోమకొండ/పెద్దకొడప్‌గల్/భిక్కనూరు: ‘ఆరోగ్యమే...మహాబాగ్యం’అనగానే గుర్తుకు వచ్చేది యోగ. గ్రామీణ ప్రాంతాల్లో యోగ నేర్చుకునేందుకు యువత, విద్యార్థులు ఆసక్తితో ఉన్నా శిక్షకులు కరువయ్యారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద యోగా శిక్షణ కేంద్రాన్ని నిర్మించారు. అయితే ఇక్కడ శిక్షకుడు మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు తూతుమంత్రంగా యోగా శిక్షణ ఇస్తున్నారని పలువురు అంటున్నారు. ప్రభుత్వ పాఠశాలతోపాటు అంగన్ వాడి కేంద్రంలో చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు. దోమకొండ మండల కేంద్రంలో ఆయూష్ ఆధ్వర్యంలో యోగా కేంద్రం కొనసాగుతోంది. మండల కేంద్రానికి చెందిన ప్రముఖ యోగా మాస్టర్ గర్థాస్ కృష్ణను యోగా ట్రైనర్‌గా నియమించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఆయన విద్యార్థులకు యోగా నేర్పుతున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, లింగంపేట, గాంధారి మండలాల్లో ఆయుష్‌శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య స్వస్థత కేంద్రాల పేరిట యోగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. శిక్షకులను సైతం నియమించారు. యోగాశిక్షకులు ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం వేళల్లో గంటపాటు యోగాసానాలు వేయిస్తున్నారు. యోగాసానాలు వేయడం వల్ల ఆరోగ్యకరంగా ఉంటారని శిక్షకులు ప్రజలకు అవగాహాన కల్పిస్తున్నారు. గర్బీణులు నిత్యం యోగాసానాలు వేయడం వల్ల సుఖప్రసవం జరుగుతుందని వారు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో యోగాకేంద్రాలను ప్రజలు పూర్తిస్థాయిలో ద్వినియోగం చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దకొడప్‌గల్ తహసీల్ కార్యాలయం ఆవరణలో యోగాపై ఆయుర్వేదిక్ వైద్యుడు వెంకటస్వామి అవగాహన కల్పించారు.
తహసీల్దార్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. యోగాతో మహిళల్లో సమస్యలకు చెక్ పెట్టొచ్చని ఆయుష్ భిక్కనూరు మండల వైద్యాధికారి భవానీప్రసాద్ అన్నారు. మహిళ సమాఖ్య భవనంలో మహిళలకు యోగాపై అవగాహన కల్పించారు. ఆయన వెంట యోగ శిక్షకులు ప్రశాంత్, సంధ్య, ఏపీఎం సాయిలు తదితరులు ఉన్నారు.
కామారెడ్డి అర్బన్: జిల్లా కేంద్రంలోని భవానీరోడ్డులో ఉన్న ఖేలో ఇండియా బ్యాడ్మింటన్ అకాడమీలో ఆదివారం ఉదయం 7గంటల నుంచి 8 గంటల వరకు యోగా దినోత్సవం నిర్వహించనున్నారు. ఆయుష్, యూత్ అండ్ స్పోర్ట్స్, వైద్యశాఖల సంయుక్త ఆధ్వర్యంలో కామారెడ్డి శ్రీసరస్వతి విద్యామందిర్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించేవారు. కాగా ఈ సారి కలెక్టర్ సరస్వతి విద్యామందిర్‌కు బదులుగా లింగంపేట నాగన్న బావి వద్ద అధికారికంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని ఆయుష్ అధికారులను ఆదేశించారు. జిల్లా యంత్రాంగం ఉదయం పూట అక్కడి చేరుకోవడం ఇబ్బంది అవుతుందన్న ఆలోచనతో ఖేలో ఇండియా బ్యాడ్మింటన్ అకాడమీలో నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో సందిగ్ధత తొలిగింది. యోగా అభిమానులు ఖేలో ఇండియా బ్యాడ్మింటన్ అకాడమీకి చేరుకోవాలని అధికారులు కోరారు.
జిల్లాలోని పలుచోట్ల ఆయుష్
యోగా కేంద్రాల ఏర్పాటు
యోగా శిక్షణ కేంద్రాల్లో
శిక్షణ ఇస్తున్న ట్రైనర్లు
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం


