మాచారెడ్డి: బాల్య వివాహాలు చేయొద్దని గజ్యా నాయక్ తండా సర్పంచ్ రావుల వినోద అన్నారు. శనివారం గజ్యా నాయక్ తండా గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామ సభలో ఆమె మాట్లాడారు. బాల్య వివాహాలు జరిపిస్తే చట్టరీత్యా శిక్షార్హులవుతారని హెచ్చరించారు. అలాగే మహిళలపై గృహ హింస అరికట్టేందుకు మహిళా సంఘాలు అప్రమత్తం కావాలన్నారు. పోడు భూముల రక్షణ కోసం కమిటీని ఏర్పాటు చేశారు. మహిళల సమస్యలపై జీపీలో ఫిర్యాదు చేస్తే అవగాహన కల్పిస్తామన్నారు. జీపీకార్యదర్శి దర్శన్, ఉప సర్పంచ్ భిక్షపతి, వార్డు సభ్యులు, మహిళా సంఘాల ప్రతినిధులు ఉన్నారు.
బీబీపేట: మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా తుజాల్‌పూర్ ఉప సర్పంచ్ లక్ష్మారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారం మండల కేంద్రంలో మండల ఉపసర్పంచులు ఏర్పాటు చేసుకున్న సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఫోరం ఉపాధ్యక్షుడిగా బీబీపేట ఉపసర్పంచ్ ప్రశాంత్ ఎన్నికయ్యారు. ఉపసర్పంచులు పాత స్వామి, టంకరి బాబు, ప్రభాకర్, రాజు, సంతోష్‌రెడ్డి, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
బీబీపేట: మండల కేంద్రంలోని తిమ్మయ్యగారి సుశీల నారాయణరెడ్డి బాలుర ఉన్నత పాఠశా ల ఉత్తమ పాఠశాలగా ఎంపికై న విషయం తెల్సిందే. దీనికి సంబంధించి శుక్రవారం అవార్డును హెచ్‌ఎం రవీంద్రారెడ్డి అందుకోవడంతో ఎస్‌ఆర్ ఫౌండేషన్ సభ్యులు శనివారం ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు పూలమాల, శాలువాతో సత్కరించారు. ఫౌండేషన్ సభ్యులు మట్ట శ్రీనివాస్, రవీందర్‌రెడ్డి, అశోక్‌గౌడ్, పాత స్వామి, జీవన్‌రెడ్డి, సాయికుమార్, వెంకటరాంరెడ్డి, చాట్ల బాబు తదితరులు పాల్గొన్నారు.
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గ్రామాల్లో పేరుకుపోయిన మొండి బకాయిల వసూళ్ల కోసం స్పెషల్ డ్రైవ్ ద్వారా కార్యక్రమాలు చేపడదామని నాగిరెడ్డిపేట ఇన్‌చార్జి ఏపీఎం దత్తు సూచించారు. నాగిరెడ్డిపేట ఐకేపీ కార్యాలయంలో శనివారం ఈసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బకాయిల వసూళ్ల కోసం ప్రతి సభ్యుడు కృషి చేయాలన్నారు. దీంతోపాటు బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాల లక్ష్యాలను నెరవేర్చాలని చెప్పారు. గ్రామాల్లో గ్రామసంఘాల భవనాల నిర్మాణాలను త్వరగా ప్రారంభించాలని సూచించారు. మండల సమాఖ్య అధ్యక్షులు శాంత, సీసీలు పాల్గొన్నారు.


