వృద్ధుడి ఆత్మహత్య
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని గుర్జాల్ గ్రామానికి చెందిన మంగళారం పోచయ్య (60) ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై మహేందర్ శనివారం తెలిపారు.పోచయ్య ఈ నెల 16న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రా లేదు.19న కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులకు శనివారం బ్రాహ్మణ్‌పల్లి శివారులోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఒకరు ఉరేసుకొని మృతి చెందినట్లు సమాచారం వచ్చింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతుడిని పోచయ్యగా గుర్తించారు. మృతుడి కుమారుడు సతీశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
బాలుడిపై పిచ్చికుక్కల దాడి
దోమకొండ: మండలంలోని అంచనూరు గ్రామంలో శనివారం ఓ బాలుడిపై పిచ్చికుక్కలు దాడిచేశాయి. గ్రామానికి చెందిన బైకరి రుత్విక్‌పై కుక్కలు దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు వెంటనే కుక్కలను తరిమివేసి బాలుడిని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించినట్లు తండ్రి బైకరి మహేశ్ తెలిపారు. రుత్విక్‌తోపాటు గ్రామానికి చెందిన మరో ఇద్దరిపై కుక్కలు దాడి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు.
పేకాట స్థావరంపై ..
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని రాంపూర్‌గడ్డ తండా శివారులో శనివారం పేకాట స్థావరంపై దాడి చేసి ఏడుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. పేకాడుతున్న వారి నుంచి రూ.21,610, మొబైల్ ఫోన్లు, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ట్రాలీ ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని మాల్తుమ్మెద గేట్ వద్ద ఓ వ్యక్తిని ఢీకొట్టిన ట్రాలీ ఆటోడ్రైవర్ రత్నయ్యపై శనివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై భార్గవ్‌గౌడ్ తెలిపారు. మాల్తుమ్మెద బస్టాండ్ వద్ద బస్సు కోసం వేచి ఉన్న జక్కుల భూషణం అనే వ్యక్తిని రత్నయ్య ట్రాలీ ఆటోతో ఢీకొట్టాడు. దీంతో భూషణం తలకు తీవ్రగాయాలయ్యాయి.
ఇరువర్గాల ఘర్షణ.. కేసు ..
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని నేరల్‌తండాలో భూమి కోసం ఘర్షణపడిన ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేందర్ శనివారం తెలిపారు. తండాకు చెందిన జాలం సింగ్, బాల్‌సింగ్ వర్గాలకు చెందిన వ్యక్తులు పరస్పర దాడులు చేసుకొని ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.


