నిజామాబాద్ అర్బన్ : నగరంలోని రెండో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధి వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న మదర్సా నుంచి 11 ఏళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. డిచ్‌పల్లికి చెందిన బాలుడు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో బయటకు వెళ్లి తిరిగి రాలేదని పోలీసులకు సమాచారం అందింది. దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.
గుర్జాల్‌లో వృద్ధుడు..
గాంధారి:గుర్జాల్‌కు చెందిన మంగళారం పోశయ్య(60) అదృశ్యమైనట్లు ఎస్సై మహేందర్ శుక్రవా రం తెలిపారు. ఈ నెల 16 న ఇంటి నుంచి వెళ్లిన పోశయ్య తిరిగిరాలేదు. కొడుకు సతీశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


