సంక్షిప్తం.. | - | Sakshi
Sakshi News home page

సంక్షిప్తం..

Jun 20 2026 10:50 AM | Updated on Jun 20 2026 10:50 AM

కాంగ్రెస్‌ గ్రామ కమిటీల ఏర్పాటు

లింగంపేట(ఎల్లారెడ్డి): శెట్పల్లి గ్రామ కాంగ్రెస్‌ కమిటీని శుక్రవారం మండల అధ్యక్షుడు గోకుల్‌ సాయిరాం యాదవ్‌ ఆధ్వర్యంలో నియమించారు. అధ్యక్షుడిగా అట్టెం మల్లయ్య, ఉపాధ్యక్షుడిగా సాయగౌడ్‌, బీసీ సెల్‌ అధ్యక్షుడిగా లక్ష్మీనారాయణ, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడిగా రాములు, మహిళా అధ్యక్షురాలిగా ఏసవ్వలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. సర్పంచ్‌ అట్టెం శ్రీనివాస్‌, మండల నాయకులు అశోక్‌, బాలరాజు, రవి, బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): మండలంలోని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు నల్ల మహిపాల్‌ రెడ్డి సూచించారు. శుక్రవారం మర్కల్‌లో గ్రామ కమిటీ నూతన అధ్యక్షుడిగా దొడ్లె రాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ సేవాదళ్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు లింగాగౌడ్‌, ఉప సర్పంచ్‌ లింగం, ఎస్సీ సెల్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు మద్దెల బాగయ్య, ఏఎంసీ చైర్మన్‌ సంగ్యా నాయక్‌, పద్మాజీవాడి విండో చైర్మన్‌ గంగాధర్‌, తదితరులు పాల్గొన్నారు.

చేనేత సహకార సంఘానికి డైరెక్టర్ల ఏకగ్రీవ ఎన్నిక

దోమకొండ: దోమకొండ చేనేత సహకార సంఘం ఎన్నికలకు గురువారం 9 మంది డైరెక్టర్‌లు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి భూమయ్య తెలిపారు. 10 మంది నామినేషన్లు వేయగా, గురువారం ఐరేని నర్సయ్య నామినేషన్‌ విరమించుకున్నట్లు వివరించారు. డైరెక్టర్‌లుగా బత్తిని సిద్దరాములు, సుంచు రాములు, అందే నాగభూషణం, బీసు సంతోష్‌కుమార్‌, బాలే సురేందర్‌, కూచని జగదీష్‌, బొమ్మెర జమున, కోట సదానంద, కై రంకొండ శ్రీనివాస్‌లు ఎన్నికై నట్లు వివరించారు. ఈనెల 24న వారిలో అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, క్యాషియర్‌ ఎన్నికలు ఉంటాయని ఆయన తెలిపారు. సర్పంచ్‌ ఐరేని నర్సయ్య, పద్మశాలి సంఘం అధ్యక్షుడు మ్యాక నాగరాజు, ప్రధాన కార్యదర్శి బొమ్మెర గంగాధర్‌, క్యాషియర్‌ అందే గణేష్‌, ఉపసర్పంచ్‌ బొమ్మెర శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

పిట్లంలో ఎన్నికలు ఏకగ్రీవం

పిట్లం(జుక్కల్‌): పిట్లం మండల చేనేత సహకార సంఘం డైరెక్టర్‌ ఎన్నికలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి మురళీధర్‌ గౌడ్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిట్లం చేనేత సహ కార సంఘంలో 9 డైరెక్టర్‌ పోస్టులకు 9 నామినేషన్లు మాత్రమే రావడంతో ఏకగ్రీవమైనట్లు ప్రకటించా రు. అనంతరం నియామక పత్రాలు అందజేశారు.

పెండింగ్‌ పనులకు రూ.20 లక్షల నిధులు మంజూరు

ఎల్లారెడ్డిరూరల్‌: ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పెండింగ్‌ పనులకు సంబందించి రూ.20 లక్షల నిధులను ఎమ్మెల్యే మదన్‌మోహన్‌ మంజూరు చేయించినట్లు కాంగ్రెస్‌ నాయకులు శుక్రవారం తెలిపారు. దీంతో పాటు వెంకటాపూర్‌ అగ్రహారం గ్రామానికి పైప్‌లైన్‌ కోసం రూ.3.50 లక్షల నిధులు సైతం మంజూరు చేయించారని అన్నారు. దీంతో ఎమ్మెల్యేకు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement