సదాశివనగర్(ఎల్లారెడ్డి): అర్హులైన పౌరులను ఓటర్ల జాబితాలో చేర్చి అనర్హులను జాబితాలో లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత బీఎల్‌వోలదేనని ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్ సూచించారు. గురువారం సదాశివనగర్, రామారెడ్డి, గాంధారి మండలాల బీఎల్‌వోలకు ఎస్‌ఐఆర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హాజరై మాట్లాడారు. ఈ నెల 25 నుంచి జూలై 26 వరకు ఇంటింటి సర్వే నిర్వహించి ఓటర్ల వివరాలను సేకరించాలన్నారు. ఎన్యూమరేషన్ ఫాంను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాల్సిన బాధ్యత కూడా బీఎల్‌వోలపై ఉందన్నారు. తహసీల్దార్‌లు సత్యనారాయణ, ఉమాలత, రేణుకా చౌహాన్, ఎంఆర్‌ఐ సంతోష్‌కుమార్, బీఎల్‌వోలు పాల్గొన్నారు.


