నిజామాబాద్ అర్బన్: నగరంలోని శాంతినగర్‌లో బుధవారం తెల్లవారుజామున చోరీకి పాల్పడిన నేరస్తున్ని ఐదో టౌన్‌పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై సునీల్ తెలిపిన వివరాలు.. శాంతినగర్‌లోని అజ్మీర్‌బేగం ఇంటిబయట నిద్రిస్తుంది. శాంతినగర్‌కు చెందిన పాతనేరస్తుడు రియాజ్‌ఖాన్ బుధవారం తెల్లవారుజామున ఇంట్లోకి చొరబడి రూ.లక్ష 20వేల నగదును , 20 తులాల వెండి, ఆరు గ్రాముల చెవి కమ్మలు చోరీ చేశాడు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టగా గురువారం ఉదయం ఖిల్లా చౌరస్తా వద్ద నేరస్తున్ని పట్టుకొని అతని వద్ద రూ.లక్ష 10వేల నగదును, ఇనుప సుత్తెలను స్వాధీనం చేసుకున్నారు. అతడిపై నిజామాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు, నిజామాబాద్ ఒకటో, మూడవ టౌన్‌లల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారు.


