● నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
నిజామాబాద్ అర్బన్: హర్యానా రాష్ట్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులు హార్వెస్టర్ పనుల కోసం జిల్లాకేంద్రానికి వచ్చారు. ఉదయం పనులు చేస్తు రాత్రివేళలో చోరీలకు పాల్పడుతున్నట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. ఇటీవల హమాల్‌వాడిలో సాయిబాబా ఆలయంలో జరిగిన దొంగతనం కేసులో వీరిని అరెస్టు చేశారు. హర్యానాకు చెందిన రింకుసింగ్, రవిసింగ్, అమన్‌దీప్‌సింగ్‌లు రాత్రివేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. హమాల్‌వాడిలోని సాయిబాబా మందిరంలో దొంగతనం కేసులో ఇద్దరు అరెస్టు కాగా ఇటీవల మరొకరిని పట్టుకున్నట్లు తెలిపారు. వీరిపై మూడో టౌన్‌లో రెండు కేసులు, రెండో టౌన్‌లో, మాక్లూర్‌లో ఒక్కొక్క కేసు, ఐదోటౌన్, ఆర్మూర్ టౌన్‌లో రెండేసి కేసుల చొప్పున నమోదైనట్లు తెలిపారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.


