ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు

Jun 19 2026 1:06 AM | Updated on Jun 19 2026 1:06 AM

ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు

లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని కొయ్యగుండు తండా శివారులో గురువారం ఉదయం పెరుగు, పాలు తరలిస్తున్న ట్రాలీ ఆటో బాల్తాపడి ఇద్దరికి తీవ్రగాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి వైపు పెరుగు బకెట్లు, పాల ప్యాకెట్లతో వెళ్తున్న ట్రాలీ ఆటో కొయ్యగుండు తండా శివారులోకి రాగానే రోడ్డుదాటే ప్రయత్ని చేస్తున్న తండాకు చెందిన సునీతను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌ సతీశ్‌కు తీవ్రగాయాలు కాగా, సునీతకు స్వల్ప గాయాలయ్యాయయి. డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి నిజామాబాద్‌ ఏరియా ఆస్పపత్రికి తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement