ఘనంగా బోనాల పండుగ | - | Sakshi
Sakshi News home page

ఘనంగా బోనాల పండుగ

Jun 19 2026 1:06 AM | Updated on Jun 19 2026 1:06 AM

ఘనంగా బోనాల పండుగ సూర్య నమస్కారాలు చేయాలి రుద్రూర్‌ ఎస్సైగా మనోజ్‌ బాధ్యతల స్వీకరణ

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): తాండూర్‌లో పెద్దమ్మ ఆలయ ప్రథమ వార్షికోత్సవంలో భాగంగా గురువారం భక్తులు అమ్మవారికి ఘనంగా బోనాల పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు నెత్తిన బోనమెత్తుకొని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలను సమర్పించి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

కామారెడ్డి అర్బన్‌: విద్యార్థులు ప్రతిరోజు ఉదయం సరస్వతిదేవి జపం, సూర్య నమస్కారాలు చేయాలని,తల్లిదండ్రులు, గురువులకు నమస్కారం చేయా లని శ్రీరామకోటి జప లిఖిత ప్రచారకులు కృష్ణానందస్వామీజీ అన్నారు. గురువారం పట్టణ పరిధిలోని టేక్రియాల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో కృష్ణానంద స్వామీజీ అధ్యాత్మిక ప్రవచనాలు చేశారు. విద్యార్థులకు వివిధ శ్లోకాలు వినిపించి వాటిని ప్రతి రోజూ జపించాలని సూచించారు.

రుద్రూర్‌: రుద్రూర్‌ పోలీస్‌స్టేషన్‌ నూతన ఎస్సైగా మనోజ్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. బోధన్‌ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తు న్న ఆయన బదిలీపై రుద్రూర్‌ వచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement