కామారెడ్డి టౌన్ : యువతకు ప్రైవేటు రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు 19న జిల్లా కేంద్రంలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కిరణ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మైక్రో ఫైనాన్స్ సంస్థలో పలు ఉద్యోగాల భర్తీకోసం కలెక్టరేట్ సముదాయంలోని రూమ్ నంబర్ 121లో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మేళా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం 89856 12908, 63057 43423 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
దుబాయిలో ఉద్యోగాలకు..
కామారెడ్డి టౌన్ : దుబాయిలో క్యాబ్ డ్రైవర్, బైక్ రైడర్ ఉద్యోగాలకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కిరణ్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ కార్మిక, ఉపాధి శాఖ ఆధ్వర్యంలోని టామ్‌కామ్ సంస్థ ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు 23 నుంచి 45 ఏళ్లలోపువారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ఈనెల 25వ తేదీలోపు తమ వివరాలను నమోదు చేసుకోవాలని, పూర్తి వివరాల కోసం 94400 49520, 94400 48590 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
18న డైట్‌లో ప్రవేశాలకోసం
ధ్రువపత్రాల పరిశీలన
కామారెడ్డి అర్బన్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్‌ఈడీ, డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్‌ఈ) కోర్సులలో తొలి విడత ప్రవేశాలకు హాజరుకానివారు 18న నిర్వహించే ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని నిజామాబాద్ డైట్ కళాశాల ప్రిన్సిపల్ టి.శ్రీనివాస్ ఒక ప్రకటనలో సూచించారు. అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలని పేర్కొన్నారు. అలాగే ధ్రువ పత్రాల పరిశీలన పూర్తై సీటు పొందని వారు, పొందిన వారు ఇతర కళాశాలల స్లైడిండ్ అవసరమయ్యే వారు 19, 20 తేదీల్లో వెబ్ ఆప్షన్ ఇవ్వాలని సూచించారు. మిగతా వివరాలకు డీఈసెట్ వెబ్‌సైట్ సందర్శించాలని తెలిపారు.
భిక్కనూరు: భిక్కనూరు పంచాయతీకి కేజేఎల్ పౌల్ట్రీస్ డైరెక్టర్ శ్రీనివాసరాజు రూ. 10 లక్షల విలువ చేసే వాహనాన్ని బుధవారం బహూకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంస్థ తరఫున సామాజిక బాధ్యతలో భాగంగా చెత్తను తరలించే వాహనాన్ని అందజేశామన్నారు. ఆయనను సర్పంచ్ బల్యాల రేఖ ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ మోహన్‌రెడ్డి, ఈవో మహేశ్‌గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్, శ్రీసిద్దరామేశ్వరాలయం పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షుడు లింబాద్రి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
భిక్కనూరు: రామేశ్వర్‌పల్లిలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయానికి శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి రూ. 5.50 లక్షల విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయనను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి సన్మానించారు. కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షుడు సూర్యకాంత్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ రాణిరాజు, ఉపసర్పంచ్ వినోద్‌గౌడ్, దేవాలయం డైరెక్టర్ రమేశ్‌రెడ్డి, నాయకులు నర్సరెడ్డి, నరేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, బాల్‌రెడ్డి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాడ్వాయి: తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను బు ధవారం ఎస్పీ రాజేశ్ చంద్ర తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, సిబ్బంది బ్యారక్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కేసులో నాణ్యమైన ద ర్యాప్తు చేపట్టి బాధితులకు సత్వర న్యాయం అందించాలని సూచించారు. మహిళలపై జరిగే నేరాలు, పోక్సో చట్టం, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాల న్నారు. గడువులోగా కేసుల దర్యాప్తు పూర్తి చేసి నిందితులను న్యాయస్థానం ముందు హాజరు పరచాలన్నారు. కార్యక్రమంలో ఎస్సై నరేశ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


