‘ఎస్‌ఐఆర్‌’పై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

‘ఎస్‌ఐఆర్‌’పై అప్రమత్తంగా ఉండాలి

Jun 18 2026 1:17 AM | Updated on Jun 18 2026 1:17 AM

అర్హుల ఓటు హక్కును కాపాడాలి

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ

మాట్లాడుతున్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ

కామారెడ్డి టౌన్‌ : ఎస్‌ఐఆర్‌పై అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులకు సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని క్లాసిక్‌ ఫంక్షన్‌ హాల్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ఎస్‌ఐఆర్‌ శిక్షణ సదస్సు నిర్వహించారు. ఎస్‌ఐఆర్‌పై ప్రత్యేకంగా ముద్రించిన బుక్‌లెట్లను నాయకులు, బూత్‌ లెవల్‌ ఏజెంట్లకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేసేలా బీజేపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. ముఖ్యంగా మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. బోగస్‌ ఓట్లను సృష్టించి అనైతిక లబ్ధి పొందే కుట్రలను ప్రజాస్వామ్య పద్ధతిలో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అర్హులైన వారి ఓటు హక్కును కాపాడడం ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త బాధ్యత అన్నారు. కొత్త ఓటర్ల నమోదుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రకాంత్‌రెడ్డి, నాయకులు కై లాస్‌ శ్రీనివాస్‌, సందీప్‌, వివిధ మండలాల అధ్యక్షులు, కౌన్సిలర్లు, బీఎల్‌ఏలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement