‘అనుబంధ’ వ్యాపారం | - | Sakshi
Sakshi News home page

‘అనుబంధ’ వ్యాపారం

Jun 17 2026 4:57 AM | Updated on Jun 17 2026 4:57 AM

ఫిర్యాదు చేస్తే..

కామారెడ్డి టౌన్‌ : బడి గంట మోగింది.. పుస్తకాల సంచులు సర్దుకుని పిల్లలు పాఠశాలల బాట పట్టారు. అయితే విద్యా సంవత్సరం ప్రారంభంతో తల్లిదండ్రుల గుండెల్లో ఫీజుల దడ మొదలయ్యింది. ప్రైవేటు విద్యాసంస్థలపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో ఏటా ఫీజులు పెంచేస్తూనే ఉన్నారు.

జిల్లాలో విద్యాశాఖ అనుమతి పొందిన ప్రైవే ట్‌ ప్రైమరీ స్కూళ్లు 7, యూపీఎస్‌లు 96, హైస్కూ ల్స్‌ 80 ఉన్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా మరో 50 వరకు పాఠశాలలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్‌ పాఠశాలల్లో 70 వేలకు పైగా విద్యార్థులున్నారు. చాలా పాఠశాలలు ఏటా 10 శా తం వరకు ఫీజులు పెంచేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీకి గురిచేస్తున్నాయి. అడ్మిష న్‌ ఫీజులు, డొనేషన్ల పేరుతో అదనపు వసూళ్లు కొనసాగుతున్నాయి. విద్యాశాఖ నిబంధనల ప్రకారం పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కమిటీలు ఉండాలి. కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడా అవి అమలు కావ డం లేదు. యాజమాన్యాలు నిర్ణయించిన ఫీజులను కట్టడానికి చాలామంది అప్పులపాలవుతున్నారు.

ప్రైవేట్‌ స్కూల్స్‌ యజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజు లు వసూలు చేయవద్దు. పా ఠశాల ఆవరణలో పుస్తకా లు, ఇతర సామగ్రిని విక్రయించరాదు. విద్యార్థుల త ల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటాం. విద్యాశాఖ నిబంధనలకు పాటించని పాఠశా లల యజమాన్యాలకు నోటీసులు జారీచేస్తాం.

– మల్లికార్జున్‌, డీఈవో, కామారెడ్డి

ట్యూషన్‌ ఫీజులతోనే ఆగకుండా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అనుబంధ దందాలూ నడిపిస్తున్నాయి. పుస్తకాలు, నోట్‌బుక్కులు, బ్యాగులు, యూనిఫాంలు సైతం పాఠశాలలోనే కొనుక్కోవాలి. అదీ వారు నిర్ణయించిన ధరకే.. చాలాచోట్ల పాఠశాల ప్రాంగణాల్లోనే ఈ దందా సాగుతోంది. కొన్నిచోట్ల వారు సూచించిన దుకాణాల్లోనే పుస్తకాలు, నోట్‌బుక్స్‌, యూనిఫారాలు, బెల్టులు, షూస్‌ కొనుగోలు చేయాలంటూ నిబంధనలు విధిస్తున్నాయి. వీటికోసం వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. జిల్లాలోని చాలా పాఠశాలలు నిబంధనలను తుంగలో తొక్కి విద్యావ్యాపారం చేస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఫీజుల నియంత్రణ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement