కామారెడ్డి క్రైం: రెడ్‌క్రాస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానం సా ధించిందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం సందర్భంగా జిల్లా ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో మంగళవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ రోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ర క్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తదానం వల్ల ఎలాంటి ఆనారోగ్య సమస్యలు రావన్నా రు. రెడ్‌క్రాస్ సభ్యత్వ నమోదు గడువును జూలై 31 వరకు పొడిగించినట్లు తెలిపారు. సభ్యత్వ నమోదులో జిల్లా అగ్రస్థానంలో కొనసాగడానికి మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందన్నా రు. రక్తదానం చేసిన ఎకై ్సజ్ శాఖ అధికారులు, సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో అ దనపు కలెక్టర్లు విక్టర్, గిరి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ హన్మంతరావు, రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


