● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
● ‘బడిబాట’లో సామూహిక అక్షరాభ్యాసం
లింగంపేట: బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ విద్యార్థులకు సూచించారు. మంగళవారం బడి బాట కార్యక్రమంలో భాగంగా శెట్పల్లి గ్రామంలో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పాల్గొని విద్యార్థులతో అక్షరాలు దిద్దించారు. పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కులు పంపిణీ చేశారు. అనంతరం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. రక్తదానానికి అందరూ ముందుకు రావాలని సూచించారు. మండలంలో ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన విద్యార్థులకు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. పోతాయిపల్లి గ్రామంలో యూరియా బస్తాల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. గోదామును పరిశీలించారు. రైతులు యురియా కోసం తప్పనిసరిగా యాప్‌లో బుక్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.


