మోగిన బడిగంట | - | Sakshi
Sakshi News home page

మోగిన బడిగంట

Jun 16 2026 1:40 AM | Updated on Jun 16 2026 1:40 AM

మోగిన బడిగంట నకిలీ ఆడియో బాధ్యులపై చర్యలు తీసుకోవాలి ‘వృద్ధులు సమాజానికి అమూల్యమైన సంపద’ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల్లో ఒకే రోజు 193 మందికి కోర్టు శిక్షలు కనిపించని విద్యార్థులు.. నకిలీ విత్తనాలతో రైతులు అప్రమత్తంగా ఉండాలి

న్యూస్‌రీల్‌

ఏకరూప దుస్తులు ఎప్పుడిస్తరో..

ఐదేళ్లలోపు పిల్లందరికీ

చుక్కల మందు వేయాలి

కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

మంగళవారం శ్రీ 16 శ్రీ జూన్‌ శ్రీ 2026

– 8లో u

షబ్బీర్‌ అలీతో నేను మాట్లాడలేదు

కాంగ్రెస్‌ నాయకుడు

గీరెడ్డి మహేందర్‌రెడ్డి

కామారెడ్డి టౌన్‌ : తన పేరుతోపాటు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ పే రును వాడు తూ సోషల్‌ మీ డియాలో ప్రచారం అవుతున్న ఆడియో క్లిప్‌ పూర్తిగా నకిలీదని పోసానిపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు గీరెడ్డి మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కామారెడ్డి డీఎస్పీ మ ధుసూదన్‌, పట్టణ సీఐ నరహరికి సోమవారం ఫిర్యాదు చేశారు. ఈనెల 12వ తేదీ రాత్రి నుంచి కొందరు వ్యక్తులు నకిలీ ఆడియోను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత వి భేదాలు సృష్టించి, నాయకుల ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకే కొందరు ఈ కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు. నకిలీ ఆడియోను సృష్టించిన వారిని, సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్న వా రిని సాంకేతికత ఆధారంగా గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆయన పోలీసులను కోరారు.

కామారెడ్డి అర్బన్‌: వృద్ధులు సమాజానికి అమూల్యమైన సంపదని, వారి అనుభవాలు, విలువలు, మార్గ దర్శకత్వం కుటుంబాలకు, సమాజానికి ఎంతో అవసరమని అడిషనల్‌ కలెక్టర్‌ ఎన్‌వై గిరి అన్నారు. ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ రోజును పురస్కరించుకుని జిల్లా సీనియర్‌ సిటిజన్స్‌ ఫోరం ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీనియర్‌ సిటిజన్స్‌ ఫోరం అధ్యక్షుడు పున్న రాజేశ్వర్‌ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి అడిషనల్‌ కలెక్టర్‌ గిరి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. కొంత మంది వృద్ధులు శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక వేధింపులకు గురువతున్నారని, ఇది అత్యంత ఆందోళనకరమైన విషయమన్నారు. వివక్షకు గురవుతున్న వృద్ధులకు సీనియర్‌ సిటిజన్స్‌ ఫోరం ప్రతినిధులు అండగా నిలిచి న్యాయం చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలన్నారు. కార్యదర్శి ఎం.రాజన్న, ప్రతినిధులు జైహింద్‌గౌడ్‌, పీవీ నర్సింహం తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి క్రైౖం: డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల్లో పట్టుబడిన వారిని సోమవారం జిల్లాలోని ఆయా న్యాయస్థానాల్లో పోలీసులు హాజరుపర్చగా ఒకే రోజు 193 మందికి శిక్షలు ఖరారయ్యాయి. ఆయా పీఎస్‌ల పరిధిలో రెండు రోజులుగా నిర్వహించిన వాహనాల తనిఖీల్లో పట్టుబడిన వారిని పోలీసులు కోర్టుల్లో హాజరుపరిచ్చారు. న్యాయస్థానాలు ముగ్గురికి రెండు రోజులు, మరో 10 మందికి ఒకరోజు జైలు శిక్షతో పాటు మొత్తం 193 మందికి రూ.2,07,300 జరిమానా విధించినట్లు ఎస్పీ రాజేశ్‌చంద్ర తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

కామారెడ్డి టౌన్‌ : వేసవి సెలవులు ముగియడంతో జిల్లాలో సోమవారం బడి గంట మోగింది. నూతనోత్సాహంతో, సరికొత్త ఆశలతో ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకున్నప్పటికీ, మొదటి రోజు ఆశించిన స్థాయిలో విద్యార్థుల సందడి కనిపించలేదు. అమావాస్య కావడంతో జిల్లాలోని మెజారిటీ పాఠశాలలు వెలవెలబోయాయి. సెంటిమెంట్‌ కారణంగా పిల్లలను బడికి పంపేందుకు తల్లిదండ్రులు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో మొదటి రోజు హాజరు శాతం నిరాశాజనకంగా నమోదైంది. చాలా బడుల్లో విద్యార్థుల సంఖ్య కన్నా ఉపాధ్యాయులే సంఖ్యే ఎక్కువగా కనిపించింది. కొన్ని పాఠశాలల్లో ఒక్కరిద్దరు విద్యార్థులు మాత్రమే హాజరుకావడం గమనార్హం.

జిల్లాలో 1013 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 70 వేల మందికి పైగా విద్యార్థులున్నారు. అలాగే కేజీబీవీలు, మోడల్‌, సంక్షేమ పాఠశాలలు మరో 73 ఉండగా వాటిలో 22 వేల మందికి పైగా చదువుతున్నారు. మొదటి రోజు కనీసం 10 శాతం మంది విద్యార్థులు కూడా పాఠశాలల ముఖం చూడలేదు. దాదాపు ప్రభుత్వ పాఠశాలల్లో 64 వేలు, ప్రభుత్వ సంస్థల పాఠశాలల్లో 3 వేల వరకు విద్యార్థులు హాజరైనట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా దాదాపు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. అయితే మొదటి రోజు పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు పలు చోట్ల ఉపాధ్యాయులు కార్పెట్‌లు పరిచి, పూలు చల్లుతూ, బొకెలు అందించి ఘనస్వాగతం పలికారు.

జిల్లా

కేంద్రంలోని ప్రభుత్వ గంజ్‌ స్కూల్‌లో

గంట

కొడుతున్న సిబ్బంది

డిబాట, ఉపాధ్యాయుల సర్దుబాటు కసరత్తులు పూర్తి చేసుకుని ఉపాధ్యాయులంతా సమయానికే విధులకు హాజరైనప్పటికీ, తరగతి గదుల్లో విద్యార్థుల సంఖ్య పది కూడా దాటలేదు. ఫలితంగా, కొన్ని స్కూళ్లలో విధుల్లో ఉన్న ఉపాధ్యాయుల సంఖ్య కంటే హాజరైన విద్యార్థుల సంఖ్యే తక్కువగా ఉండటం గమనార్హం.

● నాగిరెడ్డిపేట మండలం గోపాల్‌పేట ప్రాథమిక పాఠశాల, బాన్సువాడ పట్టణ కేంద్రంలోని చామన్‌ గల్లి స్కూల్‌లో ఒక్కో విద్యార్థి మాత్రమే హజరయ్యారు. అలాగే గోపాల్‌పేట హై స్కూల్‌కు నలుగురు విద్యార్థులు వచ్చారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గంజ్‌ పాఠశాలకు ఏడుగురు విద్యార్థులు రాగా, 17 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. పెద్దొడప్‌గల్‌ మండలంలోని కాస్లామాద్‌ ప్రాథమిక పాఠశాలకు ఆరుగురు విద్యార్థులు మాత్రమే వచ్చారు.

నాగిరెడ్డిపేట మండలం గోపాల్‌పేట

హైస్కూల్‌లో హాజరైన నలుగురు విద్యార్థులు

పాత బాన్సువాడ చమాన్‌ స్కూల్‌కు

హాజరైన ఒకే ఒక్క విద్యార్థి

నాగిరెడ్డిపేట మండలం గోపాల్‌పేట ప్రాథమిక పాఠశాలలో హాజరైన ఒకే ఒక్క విద్యార్థి

మద్నూర్‌(జుక్కల్‌): కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలకు సరిహద్దున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో రైతులకు నకిలీ విత్తనాలు అంటగడతారని రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ కమిషన్‌ సభ్యుడు గడుగు గంగాధర్‌ సూచించారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం ఉమ్మడి జిల్లా వ్యవసాయశాఖ అధికారులతో ఫోన్‌లో విత్తనాలు, ఎరువులపై సమీక్షించారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు సరిహద్దున ఉన్న మద్నూర్‌, బిచ్కుంద, జుక్కల్‌ మండలాల రైతులు విత్తనాలు కోనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చే విత్తనాలు తక్కువ ధర ఉండటంతో వ్యాపారులు రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతున్నారన్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న పది దుకాణాలపై కేసులు నమోదు చేశామని తెలిపారు. ప్రభు త్వం పంట మార్పిడిపై రైతులకు అవగహన కల్పించాలని ఆదేశించిన వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యంగా ఉండటం సరికాదన్నారు. రైతులు వరికి ప్రత్యామ్నాయంగా వాణిజ్య పంటలు సాగు చేయాలని సూ చించారు. జిల్లాలో యూరియా కొరత లేదని రైతులు ఆందోళన చెందొద్దన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌, అడిషనల్‌ కలెక్టర్‌ విక్టర్‌, గిరి

కామారెడ్డి క్రైం: ఈ నెల 28వ తేదీన నిర్వహించే పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అధికారులకు సూచించారు. పల్స్‌ పోలియోతోపాటు డీ వార్మింగ్‌ డే, స్టాప్‌ డయేరియా క్యాంపెయిన్‌ల కూడా పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఆయా కార్యక్రమాల అమలుపై కలెక్టరేట్‌లో జిల్లా టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. 0 నుంచి 5 ఏళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పల్స్‌ పోలియో చుక్కలు అందేలా వైద్యారోగ్య శాఖ సమగ్ర ప్రణాళిక రూపొందించిందని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రతి చిన్నారికి పోలియో వ్యాక్సిన్‌ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో 733 పల్స్‌ పోలియో బూత్‌లు, 36 ట్రాన్సిట్‌ పాయింట్లు, 22 మొబైల్‌ బృందాలు, 199 హైరిస్క్‌ ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు వివరించారు. ఈనెల 29, 30 తేదీల్లో ఇంటింటి సర్వే నిర్వహించి మిగిలిపోయిన ప్రతి చిన్నారికి పల్స్‌ పోలియో చుక్కలు అందజేయడం జరుగుతుందని వెల్లడించారు. జూన్‌, జూలై నెలల్లో నిర్ణీత తేదీల్లో డీ వార్మింగ్‌ డే, స్టాప్‌ అడయేరియా క్యాంపెయిన్‌ను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు విక్టర్‌, గిరి, జెడ్పీ సీఈవో చందర్‌నాయక్‌, డీఎంహెచ్‌వో వెంకట్‌, డీపీవో మురళి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మొదటి రోజు స్కూళ్లకు హాజరైన విద్యార్థులో చాలా మంది సివిల్‌ డ్రెస్‌లోనే హాజరుకాగా, మరి కొందరు గతేడాది అందజేసిన ఏకరూప దుస్తుల్లో వచ్చారు. ఈ ఏడా ది ఏకరూప దుస్తులు ఎప్పుడిస్తారో తెలియ క విద్యాశాఖ అధికారులు సైతం అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటి వరకు ఒక్క జత డ్రెస్సు పాఠశాలలకు చేరలేదు. నేరుగా ప్రభుత్వమే సరఫరా చేస్తుందా, లేక బట్ట జిల్లాలకు సరఫరా చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఈసారి దస్తులతోపాటు టై, బెల్డ్‌, షూ కూడా పంపిణీ చేసే అవకాశాలు ఉన్నట్లు సమచారం. సోమవారం పాఠశాలలకు హాజరైన విద్యార్థులకు పాఠ్య, నోట్‌ పుస్తకాలు పంపిణీ చేశారు.

అమావాస్య ఎఫెక్ట్‌.. మొదటి రోజు

వెలవెలబోయిన ప్రభుత్వ పాఠశాలలు

పది శాతం దాటని విద్యార్థుల హాజరు

కొన్ని స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య

కన్నా ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువ

ఏకరూప దుస్తుల పంపిణి ఊసే లేదు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement