ఇంటి నుంచే లైసెన్స్‌కు తొలి అడుగు | - | Sakshi
Sakshi News home page

ఇంటి నుంచే లైసెన్స్‌కు తొలి అడుగు

Jun 16 2026 1:40 AM | Updated on Jun 16 2026 1:40 AM

ఇంటి నుంచే లైసెన్స్‌కు తొలి అడుగు తిరగాల్సిన పని లేదు

ఎలా దరఖాస్తు చేసుకోవాలి..

ఆన్‌లైన్‌ పరీక్షలో పాసైతే

వెంటనే లెర్నర్‌ లైసెన్స్‌

● కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌ సారథి పరివాహన్‌కు వెళ్లాలి.

● సారథి వెబ్‌సైట్‌లో రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలి.

● అప్‌లై ఫర్‌ ఎల్‌ఎల్‌ఆర్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

● ఆధార్‌ నంబర్‌ తదితర వివరాలను నమోదు చేసి లాగిన్‌ కావాలి.

● అవసరమైన ధ్రువపత్రాలను స్కాన్‌ చేసి అప్‌లోడ్‌ చేయాలి.

● దరఖాస్తు ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి.

● ఆన్‌లైన్‌ పరీక్షకు అదనంగా రూ.50 చెల్లించాలి.

● ఆన్‌లైన్‌లో నిర్వహించే ఫేస్‌ లెస్‌ సర్వీస్‌ ద్వారా ట్రాఫిక్‌ రూల్స్‌, రోడ్‌ సెన్స్‌పై నిర్వహించే పరీక్ష రాయాలి.

● పరీక్షలో పాసైనవారు లెర్నర్‌ లైసెన్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. లైసెన్స్‌ ఆరు నెలల పాటు చెల్లుబాటులో ఉంటుంది.

ఎల్లారెడ్డి: డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందాలంటే ఆర్టీవో కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిన పని లేదు. ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తు, పరీక్ష ప్రక్రియను పూర్తి చేసుకుని ఎల్‌ఎల్‌ఆర్‌ (లెర్నర్‌ లైసెన్స్‌ రిజిస్ట్రేషన్‌) పొందవచ్చు.

అవసరమైన ధ్రువపత్రాలు

● వయస్సు ధ్రువీకరించే ఆధార్‌ కార్డు లేదా బర్త్‌ సర్టిఫికేట్‌ లేదా పాస్‌ పోర్ట్‌.

● నివాసాన్ని ధ్రువీకరించే ఆధార్‌కార్డు లేదా ఓటర్‌కార్డు లేదా రేషన్‌కార్డు.

● 50 సంవత్సరాలు దాటిన వారికి ఫారం–1ఏ డాక్టర్‌ సర్టిఫికేట్‌ అందించాలి.

● పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలు.

పరీక్ష విధానం

20 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. కనీసం 12 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇస్తే ఉత్తీర్ణులవుతారు. ట్రాఫిక్‌ నియమాలు, రహదారి సంకేతాలు, వాహనదారుల బాధ్యతలు, వేగ పరిమితులు, రోడ్డు భధ్రతా నియమాలు తదితర అంశాలపై ప్రశ్నలు ఉంటాయి . పరీక్ష సులభంగా పాస్‌ కావాలంటే ట్రాఫిక్‌ సిగ్నల్స్‌, రోడ్డు గుర్తులపై అవగాహన పెంచుకోవాలి. మాక్‌ టెస్ట్‌లు ప్రాక్టీస్‌ చేయాలి.

డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. రోడ్డు రవాణశాఖ పోర్టల్‌ సారథి పరివాహన్‌ వెబ్‌సైట్‌లో ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్ష పాసైతే చాలు. దళారులను, ఏజెంట్లను ఆశ్రయించాల్సిన పనిలేదు. పరీక్ష పాసైతే లభించే లెర్నర్‌ లైసెన్స్‌ ఆరు నెలల వరకు చెల్లుబాటు అవుతుంది.

– సంతోష్‌కుమార్‌, జిల్లా రవాణాశాఖ అధికారి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement