బీబీపేట: పంట వేసిన నుంచి పంట చేతికి వచ్చి రైస్‌మిల్లుకు చేరే వరకు రైతులకు తిప్పలు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రంలో వడ్ల కొనుగోలు అయిన తర్వాత కూడా లారీని రైస్‌మిల్లు వద్దకు తీసుకువెళ్లే బాధ్యత అధికారులు రైతుల మీదనే మోపుతున్నారు. బీబీపేట మండలం మల్కాపూర్ గ్రామంలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం ఒక లారీలో ముగ్గురు రైతుల వడ్లను లోడ్ చేశారు. లారీ గ్రామం నుంచి రైస్‌మిల్లు వరకు వెళ్లే దారిలో సుమారు 5 చోట్ల విద్యుత్ వైర్లు కిందికి ఉండడంతో ఆ ముగ్గురు రైతులే వాటిని పైకి లేపుతూ లారీని ముందుకు తీసుకువెళ్లారు. కిందికి వేళాడుతున్న వైర్లను పైకి లేపుతూ రైస్ మిల్లుకు చేర్చారు. ప్రతిసారి లారీ వచ్చినప్పుడు రైతులకు ఈ తిప్పలు తప్పవని, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే వైర్లు పూర్తిగా కిందికి ఉన్నాయని రైతులు వాపోయారు.


