నా తండ్రికి అవసరమైనప్పుడు విలువ తెలిసింది | - | Sakshi
Sakshi News home page

నా తండ్రికి అవసరమైనప్పుడు విలువ తెలిసింది

Jun 14 2026 7:16 AM | Updated on Jun 14 2026 7:16 AM

రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. 2012లో మా నాన్నకు బైపాస్‌ సర్జరీ అయినపుడు 3 యూనిట్ల ‘ఓ నెగిటీవ్‌’ రక్తం అవసరమైంది. అప్పడు తెలిసింది రక్తం విలువ. మా తండ్రికి రక్తం ఇచ్చిన దాతలు నాకు ఒకటే చెప్పారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా రక్తదానంపై అందరిని చైతన్యం చేయాలన్నారు. నాటి నుంచి కామారెడ్డి రక్తదాతల సమూహం ద్వారా 31 సార్లు రక్తదానం చేశాను. రక్తం దానంతో ఎంతో సంతృప్తి చెందుతా. రక్తదాతల సమూహం అధ్యక్షునిగా రక్తదాన శిబిరాల్లో చురుకుగా పాల్గొంటున్నా.

– జమీల్‌ అహ్మద్‌, అధ్యక్షుడు, కామారెడ్డి బ్లడ్‌ డోనర్స్‌ గ్రూప్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement