మూడు నెలలకోసారి తండ్రీకొడుకుల రక్తదానం | - | Sakshi
Sakshi News home page

మూడు నెలలకోసారి తండ్రీకొడుకుల రక్తదానం

Jun 14 2026 7:16 AM | Updated on Jun 14 2026 7:16 AM

జిల్లా కేంద్రానికి చెందిన పర్ష వెంకటరమణ, ఆయన కుమారులు మృణాల్‌, తృషాల్‌ ప్రతి మూడు నెలలకోసారి క్రమం తప్పకుండా రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ‘ఏ నెగెటీవ్‌’ బ్లడ్‌ గ్రూప్‌ కలిగిన వెంకటరమణ గత ఏడేళ్లుగా ప్రతి 3 నెలలకోసారి, ఇప్పటివరకు 26 సార్లు రక్తదానం చేశారు. ‘ఏ పాజిటివ్‌’ బ్లడ్‌ గ్రూప్‌ కలిగిన పెద్ద కుమారుడు మృణాల్‌ ఏడాదికి నాలుగు సార్లు, ‘ఓ నెగటివ్‌’ బ్లడ్‌ గ్రూప్‌ కలిగిన చిన్న కుమారుడు తృషాల్‌ కూడా ఏడాదికి నాలుగు సార్లు రక్తదానం చేస్తున్నారు. గత ఏడేళ్లుగా తండ్రి, నాలుగేళ్లుగా కుమారులు రక్తదానం చేస్తూ కుటుంబమంతా ప్రాణదాతలుగా గుర్తింపు పొందారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement