కారును ఢీకొన్న లారీ | - | Sakshi
Sakshi News home page

కారును ఢీకొన్న లారీ

Jun 7 2026 8:00 AM | Updated on Jun 7 2026 8:00 AM

ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోండి పీఈసెట్‌లో జిల్లావాసులకు ర్యాంకులు పిట్లం – నిజామాబాద్‌ బస్సు పునఃప్రారంభం

మాజీ ఎమ్మెల్యేకు త్రుటిలో

తప్పిన ప్రమాదం

భిక్కనూరు: బస్వాపూర్‌ సమీపంలోని జాతీ య రహదారిపై కారును వెనకనుంచి వచ్చిన లారీ ఢీకొన్న ఘటనలో నిజామాబాద్‌ అర్బన్‌ మాజీ ఎమ్మెల్యేకు త్రుటిలో ప్రమాదం తప్పింది. వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్‌ అర్బన్‌ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా శనివారం తన కారులో హైదరాబాద్‌ నుంచి నిజమాబాద్‌ వైపు వెళ్తున్నారు. భిక్కనూరు మండలం బస్వాపూర్‌ గ్రామ శివారులోని జాతీయ రహదారిపై ఆయన కారును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు డివైడర్‌పైకి ఎక్కి నిలిచిపోయింది. కారులో ప్రయాణిస్తున్న మాజీ ఎమ్మెల్యేతోపాటు ఇతరులు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో పార్టీ నాయకు లు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఆయన వేరే కారులో నిజామాబాద్‌ బయలుదేరి వెళ్లారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అంజనేయులు తెలిపారు.

కామారెడ్డి అర్బన్‌: ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లకో సం ఈనెల 12 వ తేదీలోగా దరఖాస్తు చేసు కోవాలని జిల్లా బీసీ సంక్షేమాధికారి వెంకటేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 9, 10 తరగతులు చదువుతున్నవారు అర్హులని పేర్కొన్నారు. విద్యార్థులు టీజీఈపాస్‌లో దరఖాస్తు చేసుకుని, సంబంధించిన ప్రతులను పాఠశాలలో అందజేయాలని సూచించారు.

బాన్సువాడ: పీఈసెట్‌లో జిల్లాకు చెందిన వాలీబాల్‌ క్రీడాకారులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. బాన్సువాడ మండలం కొత్తాబాదికి చెందిన కడవత్‌ భరత్‌కు బీపెడ్‌ లో రాష్ట్ర స్థాయి 12వ ర్యాంకు, నస్రుల్లాబాద్‌ మండలం నెమ్లికి చెందిన చిట్టి మానసకు డీపెడ్‌లో రాష్ట్ర స్థాయి 23వ ర్యాంకు, ఇదే గ్రామానికి చెందిన బండి కావేరికి డీపెడ్‌లో రాష్ట్ర స్థాయి 38వ ర్యాంకు, ఇదే గ్రామానికి చెందిన గడ్డం మానసకు బీపెడ్‌లో రాష్ట్ర స్థాయి 412వ ర్యాంకు వచ్చాయని వాలీబాల్‌ కోచ్‌ సురేందర్‌ తెలిపారు. రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన వాలీబాల్‌ క్రీడాకారులను ఆయన అభినందించారు.

ిపిట్లం: పిట్లం నుంచి నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి శనివారం బస్సును పునరుద్ధరించడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు. రోజూ ఉదయం 8.10 గంటలకు పిట్లం నుంచి నిజామాబాద్‌ నగరానికి బస్సు బయలు దేరుతుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ బస్సు ఉదయం 7.10 గంటలకు బాన్సువాడ నుంచి బయలుదేరి 8 గంటలకు పిట్లంకు చేరుకుంటుందన్నారు. 8.10 కి పిట్లం నుంచి బయలుదేరి 9.50 గంటలకు నిజామాబాద్‌కు చేరుకుంటుందని పేర్కొన్నారు. ఈ సర్వీస్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement