క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

Apr 25 2026 7:54 AM | Updated on Apr 25 2026 7:54 AM

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్‌ చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. వివరాలు ఇలా.. బిచ్కుంద మండలం గోపన్‌పల్లికి చెందిన కుర్మ హన్మండ్లు (55) గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం అతడు తన స్నేహితులతో కలిసి బాన్సువాడలో జరిగే కుస్తీ పోటీలను తిలకించేందుకు బైక్‌పై బయలుదేరారు. తాడ్కోల్‌ చౌరస్తా వద్ద వారి బైక్‌ను కొయ్యగుట్ట నుంచి అతివేగంగా వస్తున్న డీసీఎం వ్యాను ఢీకొట్టింది. ఈ ఘటన లో హన్మండ్లు టైర్ల కిందపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యాన్‌ డ్రైవర్‌ పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటన స్థలానికి వచ్చి, వివరాలు సేకరించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీధర్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement