లక్కీ డ్రాలో 2.10 గుంటలు
రాజంపేట(కామారెడ్డి) : భూములు ధరలు పడిపో యి మార్కెట్‌లేని ప్రస్తుత పరిస్థితుల్లో తన భూమిని అమ్మేందుకు ఓ యువ రైతు వినూత్నంగా ఆలోచించాడు. తాను అనుకున్న ధర పొందేందుకు లక్కీ డ్రా మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆర్ధిక ఇబ్బందులు కారణంగా కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం బస్వన్నపల్లి గ్రామానికి చెందిన యువ రైతు గడ్డం రాజు తనకున్న రెండు ఎకరాల 10 గుంటల భూమిని అమ్మాలని నిర్ణయించుకున్నాడు. ఈ ప్రాంతంలో ఎకరానికి రూ.30 లక్షల ధర పలికేది. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోవడంతో మార్కెట్ ధర కన్నా చాలా తక్కువ ధరకు భూమి కొనడానికి వస్తున్నారు.
దీంతో రాజు 500 లక్కీ డ్రా టికెట్లను ఒక్కో టికెట్‌ను రూ.10వేలకు విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. మొదటి రోజైన ఆదివారం 30 టికెట్లు అమ్ముడుపోయినట్లు తెలిపాడు. వచ్చే సంక్రాంతి లోగా డ్రా ప్రక్రియ ముగిస్తానని, టికెట్లు కొనుగోలు చేసిన వారితో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తున్నానని తెలిపాడు. డ్రా తీసే రోజు అందుబాటులో లేని సభ్యులు కోసం యూ ట్యాబ్ ద్వారా లైవ్ టెలీకాస్ట్ ఇవ్వనున్నట్లు కరపత్రంలో పేర్కొన్నాడు.
ప్రస్తుతం నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు. అందుకే వ్యవసాయ భూమిని అమ్మాలని నిర్ణయించుకున్నాను. నేరు గా అమ్ముదామంటే మార్కె ట్లో తక్కువకు అడుగుతున్నారు. రియల్ ఎస్టేట్ ప డిపోవడంతో ధరలు లేవంటున్నారు. దీంతో లక్కీ డ్రా విధానాన్ని ఎంచుకున్నా. గిట్టుబాటు అవుతుందని ఆశిస్తున్నా. – గడ్డం రాజు, రైతు, బస్వన్నపల్లి
భూమి అమ్మేందుకు యువ రైతు విన్నూత్న ఆలోచన
500 టికెట్లు.. ఒక్కో టికెట్
రూ.10 వేలకు విక్రయం
అప్‌డేట్స్ కోసం వాట్సాప్ గ్రూప్
డ్రా రోజున యూట్యూబ్‌లో లైవ్ టెలీకాస్ట్
లక్కీ డ్రాలో 2.10 గుంటలు


