డాక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి టౌన్: జిల్లాలోని వైద్య విధాన ప రిషత్ పరిధి ఆస్పత్రులలో ఖాళీగా ఉన్న డా క్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఆస్పత్రుల పర్యవేక్షకురాలు డా క్టర్ విజయలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాన్సువాడ ఏరియా ఆస్పత్రి లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ (గైనకాలజిస్టు), అనస్థిషియా, ఎల్లారెడ్డి సీహెచ్‌సీలో ఇద్దరు గైనకాలజిస్టులు, ఒక అనస్థిషియా, మద్నూ ర్ సీహెచ్‌సీలో ఒక జీడీఎంవో పోస్టులు ఖా ళీగా ఉన్నాయని తెలిపారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నామని ే పర్కొన్నారు. అర్హత కలిగిన వైద్యులు ఈ నెల 17 నుంచి 20 వ తేదీ వరకు సంబంధిత సర్టిఫికెట్‌లతో జిల్లా కేంద్రంలోని డీసీహెచ్ ఎస్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 21న ఇంటర్వ్యూ ఉంటుందన్నారు.
వైద్య కళాశాలకు
బస్సు మంజూరు
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు బస్సు మంజూరైంది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వాల్యా ఆదివారం నూతన బస్సుకు పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బస్సు మంజూరుతో కళాశాలలో చదువుతున్న వైద్య విద్యార్థుల రవాణా సమస్య పరిష్కారమైందన్నారు. క్లినికల్ పోస్టింగ్‌లు, కమ్యూనిటీ హెల్త్ ప్రోగ్రామ్‌లకు విద్యార్థులు వెళ్లేందుకు ఈ బస్సు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. బస్సు మంజూరుకు కృషిచేసిన మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు.
‘చలి’మంటలు
బాన్సువాడ రూరల్: జిల్లాలో చలి తీవ్రత పె రుగుతోంది. రోజురోజుకూ కనిష్ట ఉష్ణోగ్రత లు తగ్గుతున్నాయి. దీంతో గ్రామాలు, తండాల్లోని వీఽధి మూలమలుపుల వద్ద ప్రజలు మంటలు వేసి ఉపశమనం పొందుతున్నారు.
నేడు రైఫిల్ షూటింగ్ ఎంపికలు
నిజామాబాద్ నాగారం: స్కూల్ గేమ్స్ ఫె డరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో సోమవా రం రైఫిల్ షూటింగ్ ఎంపికలు నిర్వహించనున్నట్లు కార్యదర్శి నాగమణి ఒక ప్రకటన లో తెలిపారు. నగరంలోని బోధన్ రోడ్‌లో ఉ న్న ట్రస్ట్ షూటింగ్ స్పోర్ట్స్ అకాడమీలో ఉద యం 10 గంటలకు ఎంపికలు ప్రారంభమవుతాయన్నారు. ఉమ్మడి జిల్లా క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
డాక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం


