ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసీని ఓ వ్యక్తి బురిడీ కొట్టించినట్లు తెలుస్తోంది. కొన్నినెలల క్రితం ఆర్టీసీ అధికారులు భిక్కనూరులోని సంస్థకు చెందిన పెట్రోల్ బంక్‌ను ఓ ప్రయివేట్ వ్యక్తికి లీజ్‌కు ఇచ్చారు. ఒప్పందం సమయంలో సదరు వ్యక్తి రూ.15 లక్షలు ఆర్టీసీకి డిపాజిట్ చేసినట్లు సమాచారం. ఇటీవల సదరు కాంట్రాక్టర్ హెచ్‌పీసీఎల్ సంస్థ నుంచి సుమారు రూ.28 లక్షల విలువైన 2 ట్యాంకర్ల ఇంధనాన్ని ఉద్దెర కు తెచ్చి అమ్ముకొని, బంక్‌ను మూసివేశాడు. కానీ కాంట్రాక్టర్ డబ్బులు కట్టక పోవడంతో ఇంధన సంస్థ ఇంధనాన్ని పంపడం లేదు. దీంతో ఆర్టీసీ అధికారులు బంక్‌ను తెరవడానికి ఆపసోపాలు పడుతున్నట్లు సమాచారం.
భిక్కనూరు : ఆర్టీసీ అధికారు ల అనాలోచిత నిర్ణయాలు ఆ సంస్థకు శాపంగా మారా యి. ఏ ఇబ్బంది లేకుండా నడుస్తున్న పెట్రోల్ బంకును ప్రైవేటు వ్యక్తుల కు అప్పగించి మోసపోయారు. ప్రస్తుతం బంక్ మూతపడటంతో ఆర్టీసీ ఆదాయానికి గండి పడటంతోపాటు, ప్రజలు ఇందనం కో సం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
భిక్కనూరు మండల కేంద్రంలో హెచ్‌పీసీఎల్ కంపెనీతో ఆర్టీసీ ఒ ప్పందం చేసుకొని 2020 సంవత్సరంలో పెట్రోలు బంకును ప్రా రంభించింది. ఆర్టీసీ యాజమాన్యం గత నాలుగు ఏ ళ్లుగా తమ సిబ్బందితో పంపును నిర్వహిస్తోంది. పొదుపు చర్యల్లో భాగంగా ఆర్టీసీ యాజమాన్యం కా స్ట్ ఆఫ్ కంట్రోల్ పేరుతో ఖర్చులు తగ్గించుకోవాల నే ఉద్దేశంతో ఆరు నెలల క్రితం బంక్‌ను మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి లీజ్‌కు ఇచ్చింది. సదరు వ్యక్తి ఆర్టీసీ యాజమాన్యం వద్ద రూ.15 లక్ష లు డిపాజిట్ చేసి పెట్రోల్ బంకును నిర్వహించా డు. 15రోజుల క్రితం పెట్రోల్ బంకును లీజుకు తీ సుకున్న వ్యక్తి రెండు ట్యాంకర్లు అనగా సుమారు 24వేల లీటర్ల ఇందనాన్ని ఉద్దెరగా హెచ్‌పీసీఎల్ నుంచి తెప్పించుకుని విక్రయించుకొని, బంక్‌ను మూసివేశాడు. ఈ రెండు ట్యాంకర్ల ఇంధన విలువ రూ. 28 లక్షల వరకు ఉంటుండగా, ఇంధన సంస్థకు డబ్బులు చెల్లించడం లేదు. లీజుకు తీసుకున్న వ్యక్తి తన డిపాజిట్ సొమ్ము రూ.15 లక్షలు పోను ఇంకా ఆర్టీసీకి దాదాపుగా రూ. 13 లక్షల వరకు బకాయి పడ్డట్లు తెలుస్తోంది.
భిక్కనూరు బస్టాండ్ పక్కన ఉన్న పెట్రోల్ పంపు ప్రజలందరికి అందుబాటులో ఉంది. పదిహేను రో జులుగా మూసి ఉంచడం వల్ల పెట్రోలు, డీజిల్‌కు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. దూర ప్రాంతంలో ఉ న్న పంపులకు వెళ్లాల్సి వస్తోంది. ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి పంపును పున:ప్రారంభించాలి.
–కె.రాజు, రామేశ్వర్‌పల్లి
భిక్కనూరు ఆర్టీసీ పెట్రోల్ బంక్‌ను
లీజ్‌కు ఇచ్చిన అధికారులు
రెండు ట్యాంకర్ల ఇంధనాన్ని
ఉద్దెరకు తెచ్చి వాడేసిన కాంట్రాక్టర్
డబ్బులు చెల్లించకపోవడంతో
మూతబడిన బంక్
నిర్లక్ష్యమే ముంచిందా?
హెచ్‌పీసీఎల్ యాజమాన్యం పెట్రోలు, డీజిల్‌లను నిర్ణీత ధరకు ఆర్టీసీకి సరఫరా చేస్తుంది. ఆర్టీసీ ఖాతా నుంచే ఇంధన ట్యాంకర్ లావాదేవీలు నడుస్తాయి. అట్టి ఇంధన అమ్మకాలపై కాంట్రాక్టరుకు లీటరుకు ఒక రూపాయి నుంచి రెండు రూపాయల వరకు కమీషన్ ఇస్తున్నట్లు సమాచారం. అలాగే ఆర్టీసీకి సైతం కమీషన్ వస్తుంది. పంపును లీజుకు తీసుకున్న వ్యక్తి డబ్బులు చెల్లిస్తేనే వారు ట్యాంకర్‌ను బుక్‌చేసే విధానం ఉంది. కానీ ఆర్టీసీ యాజమాన్యం ట్యాంకర్ బుకింగ్‌ను కూడా ప్రయివేట్ వారికే అప్పగించినట్లు తెలుస్తోంది. వాస్తవంగా లీజ్‌కు తీసుకున్న వ్యక్తి ఎన్ని ట్యాంకర్లు బుక్ చేశాడో అన్న విషయాన్ని ఎప్పటికప్పడు ఆర్టీసీ యాజమాన్యం చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, నిర్లక్ష్యంతో సరిగా చూసుకోకపోవడంతో సదరు వ్యక్తి డబ్బులు చెల్లించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం బంక్ మూతపడగా, ఆర్టీసీ అధికారులు తిరిగి పంపును పున:ప్రారంబించేందకు యత్నించారు. కానీ తమకు బకాయిగా ఉన్న రెండు ట్యాంకర్ల డబ్బులను చెల్లిస్తేనే ఇంధనం సరఫరా చేస్తామని హెచ్‌పీసీఎల్ అధికారులు తెలిపినట్లు సమాచారం. ఈవిషయమై హైదరాబాద్‌లోని బస్ భవన్ నుంచి అధికారులు వచ్చి వివరాలు సేకరించుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈవిషయమై కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ దినేష్‌కుమార్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా ఇది తమ సంస్థ అంతర్గత వ్యవహరమన్నారు. సదరు వ్యక్తిపై విచారణ చేపట్టి, త్వరలో పంపును పున:ప్రారంభిస్తామన్నారు.
ఆర్టీసీకి బురిడీ..!


