● సబ్ కలెక్టర్ కిరణ్మయి
మద్నూర్/బిచ్కుంద(జుక్కల్): ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో ముందుకు రావాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. వర్షాలకు ఇళ్లు కూలిపోయిన, ఇళ్లకు నష్టం వాటిల్లిన బాధితులకు బుధవారం దుప్పట్లు, దుస్తులు ఇతర సరుకులను సబ్ కలెక్టర్ కిరణ్మయి, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు రాజన్న చేతులు మీదుగా పంపిణీ చేశారు. బిచ్కుంద, మద్నూర్‌లలో ఈ కిట్లను అందించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. రెడ్‌క్రాస్ సొసైటీ రక్తదానం, హెల్త్ క్యాంపులు నిర్వహించడంతో పాటు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. తహసీల్దార్ వేణుగోపాల్, రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర సభ్యుడు సంజీవ్, నరసింహ, వేణుగోపాల్, రచ్చ శివకాంత్, డాక్టర్ నర్సింలు, ఓంప్రకాష్ పాల్గొన్నారు.