‘రైతులకు ఇబ్బంది కలగనీయొద్దు’ | - | Sakshi
Sakshi News home page

‘రైతులకు ఇబ్బంది కలగనీయొద్దు’

Sep 19 2025 2:07 AM | Updated on Sep 19 2025 2:07 AM

‘రైతు

‘రైతులకు ఇబ్బంది కలగనీయొద్దు’

‘రైతులకు ఇబ్బంది కలగనీయొద్దు’ పీజీలో 81 శాతం ఉత్తీర్ణత ‘నైపుణ్యాలను మెరుగు పరచుకోవాలి’ కామారెడ్డి ఆర్టీసీ డీఎంగా దినేశ్‌ కుమార్‌

గాంధారి: రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా పంపిణీ చేయాలని జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రెడ్డి సూచించారు. గురువారం ఆయన ఏవో రాజలింగంతో కలిసి మండల కేంద్రంలోని సింగిల్‌ విండో కార్యాలయాన్ని సందర్శించారు. సొసైటీకి వచ్చిన 444 యూరియా బస్తాలను దగ్గరుండి రైతులకు పంపిణీ చేయించారు. ఈ సందర్భంగా డీఏవో మాట్లాడుతూ సరిపడా యూరియా సరఫరా చేస్తామని, రైతులు ఆందోళన చెందరాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో విండో సీఈవో సాయిలు, ఏఈవోలు విఘ్నేష్‌, నిఖిత తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి అర్బన్‌: కామారెడ్డి జిల్లాకేంద్రంలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల (స్వయంప్రతిపత్తి) పీజీ ప్రథమ సంవత్సరం రెండో సెమిస్టర్‌ ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. తెలంగాణ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి సంపత్‌కుమార్‌, వైస్‌ప్రిన్సిపల్‌ కిష్టయ్య ఫలితాలను విడుదల చేశారు. పరీక్షల్లో 81 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని వారు తెలిపారు. కార్యక్రమంలో అదనపు పరీక్షల నియంత్రణ అధికారులు రాజేందర్‌, రాములు తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి టౌన్‌: విద్యార్థులు నైపుణ్యాలను మెరుగు పరచుకోవాలని ప్రముఖ సినీ నిర్మాత దిల్‌ రాజు సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని సాందీపని డిగ్రీ కళాశాలలో జరిగిన స్కిల్‌ ప్లస్‌ కార్యక్రమంలో లార్వెన్‌ ఏఐ స్టూడియో ఫౌండర్‌ దిల్‌ రాజు బృందం సందడి చేసింది. ఈ సందర్భంగా దిల్‌ రాజు మాట్లాడుతూ సినీ రంగంపై ఆసక్తి ఉండి అటువైపు అడుగులు వేయాలనుకుంటున్న విద్యార్థులకు లార్వెన్‌ ఏఐ స్టూడియో ద్వారా ఏఐ, వీఎఫ్‌ఎక్స్‌లలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. డిగ్రీతో పాటు వివిధ మల్టీ నేషనల్‌ కంపెనీలలో ఉద్యోగాలను పొందిన కళాశాల విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో దిల్‌ రాజు సతీమణి లార్వెన్‌ కోఫౌండర్‌ వైగా రెడ్డి, ఆయా కంపెనీల సీఈవోలు రక్షిత్‌ రెడ్డి, మనీష్‌, సాయి కిరణ్‌, దేశ్‌పాండే ఫౌండేషన్‌ ప్రతినిధులు శేఖర్‌, శ్రీకాంత్‌, సాందీపని కళాశాల డైరెక్టర్‌ హరిస్మరణ్‌రెడ్డి, ప్రిన్సిపల్‌ సాయిబాబు పాల్గొన్నారు.

కామారెడ్డి టౌన్‌: కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్‌గా పి.దినేశ్‌ కుమార్‌ నియమితులయ్యారు. గతంలో ఇక్కడ డీఎంగా పనిచేసిన కరుణశ్రీ హైదరాబాద్‌–2 డిపోకు బదిలీ అయిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో ప్రస్తుతం ఖమ్మం డిపో మేనేజర్‌గా పనిచేస్తున్న దినేశ్‌ కుమార్‌ బదిలీపై వస్తున్నారు. ఆయన ఈనెల 22న విధుల్లో చేరనున్నారు. దినేశ్‌ కుమార్‌ గతంలో ఇక్కడే ఆర్టీసీ సీఐగా విధులు నిర్వహించారు.

‘రైతులకు ఇబ్బంది కలగనీయొద్దు’
1
1/2

‘రైతులకు ఇబ్బంది కలగనీయొద్దు’

‘రైతులకు ఇబ్బంది కలగనీయొద్దు’
2
2/2

‘రైతులకు ఇబ్బంది కలగనీయొద్దు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement